ఉద్యోగం మానేస్తున్నారని దారుణం.. 8 మంది హత్య.. ఆ తర్వాత ప్లాస్టిక్ కవర్లతో చుట్టి..
America News in Telugu: వారంతా కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.. ఈ క్రమంలో వారు ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నారు.. అది జీర్ణించుకోలేని నేర కంపెనీ యాజమాన్యం.. వారిని దారుణంగా హత్యచేసింది.
America News in Telugu: వారంతా కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు.. ఈ క్రమంలో వారు ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నారు.. అది జీర్ణించుకోలేని నేర కంపెనీ యాజమాన్యం.. వారిని దారుణంగా హత్యచేసింది. ఈ దారుణ ఘటన అమెరికాలోని మెక్సికోలో చోటుచేసుకుంది. కాల్‌సెంటర్‌లో ఉద్యోగం మానేసేందుకు సిద్ధమైన ఎనిమిది మంది యువతీ, యువకులను హింసాత్మక కంపెనీ డ్రగ్ కార్టెల్ (CJNG) హత్యచేసింది. అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న మెక్సిన్‌లోని ఓ డ్రగ్ కార్టెల్‌లో ఈ ఉదంతం జరగగా.. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని అమెరికన్, మెక్సికన్ పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మెక్సికోలోని గ్వాడలజారా సమీపంలో.. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) ఆధ్వర్యంలో ఆ కాల్‌సెంటర్ నడుస్తోంది. అయితే, మెక్సిలోనే అత్యంత హింసాత్మక ముఠాగా జాలిస్కోకు పేరుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ, కిడ్నాప్‌లు, హింస తదితర కార్యకలాపాలకు మించి కార్టెల్ విస్తరించింది. అయితే, అందులో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు మే 20-22 మధ్య కనిపించకుండా పోయారు. వీరిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండగా.. వారంతా 30 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు.
వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే శరీర భాగాలతో కూడిన కొన్ని ప్లాస్టిక్ కవర్లు బయటపడటంతో పోలీసలు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీటికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగా అవన్నీ తప్పిపోయిన ఆ కాల్ సెంటర్ ఉద్యోగులవేనని నిర్ధారణ అయింది. మెక్సికోలో అత్యంత హింసాత్మక గ్యాంగ్‌గా పేరున్న ఈ జలిసో ముఠా హింసాత్మక దాడులు, సైబర్ నేరాలు, కిడ్నాప్‌లు వంటి నేరాలకు పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, షేర్ మార్కెట్‌ల పేరిట అమెరికన్లు, కెనడా వాసులు లక్ష్యంగా కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.
అయితే, అందులో పనిచేసే యువతీ, యువకుల హత్యలకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. వారంతా ఉద్యోగం మానేసేందుకు ప్రయత్నిస్తున్నారనే కారణంతోనే చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటన అమెరికాలో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే, అంతకుముందు కూడా కొంత మంది ఉద్యోగులు తప్పిపోయినట్లు పేర్కొంటున్నారు. వారిని కూడా ఈ ముఠా చంపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..