ఇంట్లో చీమలు చికాకు పుట్టిస్తున్నాయా..? ఈ సింపుల్ టిప్స్‌తో ఇట్టే పరార్.. పైసా ఖర్చు లేకుండానే..
అసలే ఎండాకాలం.. ఎండవేడిమి, ఉక్కపోత కారణంగా భూమిలోంచి పురుగులు, చీమలు వంటివి చల్లదనాన్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. ఎండాకాలంలో ఎక్కడ చూసిన చీమలో దర్శనమిస్తుంటాయి. అన్నం, పాలు, ఇతర ఆహారపదార్థాలను క్షణాల్లో పుట్టలు పుట్టలుగా చుట్టుముట్టేస్తుంటాయి. అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. మీ ఇంట్లో చీమలు పరారవుతాయి.
Updated on: Jun 07, 2023 | 1:00 PM

mirchi powder water- కారం మన అందరి ఇళ్ళల్లోనూ ఉంటుంది. వంటల్లో కచ్చితంగా వాడే కారప్పొడి చీమల్ని కూడా దూరం చేస్తుంది. ఇందుకోసం కారంని నీటిలో కలిపి చీమలు తిరిగే చోట స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల చీమలు చాలా వరకూ తగ్గుతాయి.

Vinegar- వెనిగర్‌ని వాడడం వల్ల చీమలు దూరమవుతాయి. అందుకోసం, ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఆ నీటిలో వెనిగర్ వేసి తుడవండి. ఇలా చేస్తే చీమలు దూరమవుతాయి.

Corn Flour- చీమలకు చెక్ పెట్టడంలో మొక్కజొన్న పిండి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం చీమలు ఉన్న చోట కొద్దిగా మొక్కజొన్న పిండి చల్లండి. ఆ తర్వాత నీరు పోయండి. దీంతో చీమలు ఆ చోటికి రాకుండా ఉంటాయి.

Neem Oil- వేపలో కీటకాలను చంపే శక్తి ఉంటుంది. వేప నూనెని నీటిలో స్ప్రే చేస్తే చీమలు చాలా వరకూ చచ్చిపోతాయి. కాబట్టి రెగ్యులర్‌గా ఇలా చేయండి.

Coffee Powder- కొంతమంది గింజలతో తీసిన కాఫీ పౌడర్‌ని వాడుతుంటారు. అలాంటప్పుడు వాడేసిన కాఫీ పొడిని చీమలు తిరిగే చోట చల్లితే అది చీమలని దూరంగా ఉంచుతుంది. కెమికల్స్‌తో ఉన్న చీమల మందులు వాడడం బదులు వీటిని వాడడం వల్ల సమస్య పరిష్కారమవ్వడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.




