Maruti Suzuki Jimny: మారుతి జిమ్నీ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?.. ఇంకా ఫీచర్లు అదుర్స్‌..

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్-రోడర్ జిమ్నీని విడుదల చేసింది. మహింద్ర థార్ కు పోటీగా ఈ మారుతి జిమ్నీ మార్కెట్లో అడుగు పెట్టింది. మొదట ఈ మారుతి సుజుకీ జిమ్నీని ఆటో ఎక్స్ పో 2023లో ఆవిష్కరించారు. ఐదు డోర్ల‌తో కూడిన ఈ ఎస్‌యూవీ దేశీ మార్కెట్‌లో రూ.

Maruti Suzuki Jimny: మారుతి జిమ్నీ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?.. ఇంకా ఫీచర్లు అదుర్స్‌..
Maruti Suzuki Jimny
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2023 | 9:52 AM

Maruti Suzuki Jimny: సొంత కారు కొనాలని భావిస్తున్న కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..భార‌త్‌లో మారుతి సుజుకి న్యూ ఎస్‌యూవీ జిమ్నీ లాంఛ్ అయింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫ్-రోడర్ జిమ్నీని విడుదల చేసింది. మహింద్ర థార్ కు పోటీగా ఈ మారుతి జిమ్నీ మార్కెట్లో అడుగు పెట్టింది. మొదట ఈ మారుతి సుజుకీ జిమ్నీని ఆటో ఎక్స్ పో 2023లో ఆవిష్కరించారు. ఐదు డోర్ల‌తో కూడిన ఈ ఎస్‌యూవీ దేశీ మార్కెట్‌లో రూ. 12.74 ల‌క్ష‌ల నుంచి అందుబాటులో ఉంటుంది. జిమ్నీ క‌స్ట‌మ‌ర్ డెలివరీలు బుధ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ఎస్‌యూవీ విక్ర‌యాలు మారుతి నెక్సా అవుట్‌లెట్స్ నుంచి జ‌రగ‌నున్నాయి. జిప్సీ వార‌స‌త్వాన్ని కొన‌సాగేలా రూపొందిన ఈ ఎస్‌యూవీ ఓల్డ్ కే15బీ 1.5 లీట‌ర్ పెట్రోల్ ఇంజన్ క‌లిగిఉంది.

మారుతి జిమ్నీ ధరలు :

– Zeta MT వేరియంట్ ధర రూ. 1,274,000. (ఎక్స్-షోరూమ్)

-Zeta AT వేరియంట్ ధర రూ. 1,394,000. (ఎక్స్-షోరూమ్)

ఇవి కూడా చదవండి

-ఆల్ఫా MT వేరియంట్ ధర రూ. 1,369,000. (ఎక్స్-షోరూమ్)

– ఆల్ఫా వేరియంట్ రూ. 1,489,000. (ఎక్స్-షోరూమ్)

-ఆల్ఫా MT (డ్యూయల్ టోన్) వేరియంట్ ధర రూ. 1,385,000. (ఎక్స్-షోరూమ్)

-ఆల్ఫా AT (డ్యూయల్ టోన్) వేరియంట్ ధర రూ. 1,505,000. (ఎక్స్ షోరూమ్)

మారుతి జిమ్నీ ఫీచర్లు:

ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (9 అంగుళాలు), స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, లెదర్-ర్యాప్డ్ స్టే రింగ్ వీల్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇది 5 మోనోటోన్, 2 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది గ్రానైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లష్ బ్లాక్, పెరల్ ఆర్కిటిక్ వైట్, సిజ్లింగ్ రెడ్, కైనెటిక్ ఎల్లో విత్ బ్లాక్ రూఫ్, సిజ్లింగ్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

నిచ్చెన ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడిన జిమ్నీ 1.5-లీటర్ కె15బి పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 103బిహెచ్‌పి, 134ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. . ఇది ఐదు స్పీడ్ మాన్యువల్, నాలుగు స్పీడ్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో ప్రారంభించబడింది. ఇది AllGrip Pro 4×4 సిస్టమ్‌తో వస్తుంది. 5-డోర్ల జిమ్నీ భారతదేశంలో మాత్రమే ప్రారంభించబడింది. జిమ్నీ యొక్క మూడు-డోర్ల వెర్షన్ మాత్రమే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 5-డోర్ల జిమ్నీ అందుబాటులో ఉన్న మొదటి దేశం మన భారతదేశమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..