AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC Meet: రుణ గ్రహితలకు గుడ్‌న్యూస్.. వడ్డి రేట్లు యథాతథం.. ఆర్బీఐ కీలక ప్రకటన

RBI Monetary Policy: రుణ గ్రహితలకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డి రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం నాడు పరపతి విధాన కమిటీ సమావేశం ప్రారంభం కాగా.. ఇందులో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.

RBI MPC Meet: రుణ గ్రహితలకు గుడ్‌న్యూస్.. వడ్డి రేట్లు యథాతథం.. ఆర్బీఐ కీలక ప్రకటన
Rbi Governer Shaktikanta Das
Follow us
Aravind B

|

Updated on: Jun 08, 2023 | 1:31 PM

రుణ గ్రహితలకు ఊరటనిచ్చేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డి రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మంగళవారం నాడు పరపతి విధాన కమిటీ సమావేశం ప్రారంభం కాగా.. ఇందులో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గినందుకే వడ్డీ రేట్లను పెంచలేదని తెలిపారు.

గత ఏప్రిల్‌ సమావేశంలో రెపో రేటును ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర ఆర్‌బీఐ పెంచింది. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ఏప్రిల్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి దిగివచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..