Watch: ఎవర్రా మీరంతా.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారు..! మెట్రోలో వింత చేష్టలు..

ఇందులో ఒక యువకుడు మెట్రో మధ్యలో ఉండే రాడ్‌ని సీటుగా మార్చుకుని కూర్చున్నాడు. అదేలాగో మాటల్లో చెప్పలేం.. ఇదిలా ఉంటే.. అది కూడా ఎలాంటి ఆధారం లేకుండానే. అంతలో మరో యువకుడు చేతిలో టోపీతో రాడ్‌పై బ్యాక్‌ఫ్లిప్ చేశాడు. వారిద్దరూ కలిసి చేస్తూ విన్యాసాలు చూపరులను అలాగే చూస్తుండిపోయేలా చేసింది.

Watch: ఎవర్రా మీరంతా.. ఇంత ట్యాలెంటెడ్‌గా ఉన్నారు..!  మెట్రోలో వింత చేష్టలు..
Stunt In Metro
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 08, 2023 | 1:57 PM

గత కొన్ని రోజులుగా మెట్రోకు సంబంధించిన వివిధ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది రోడ్డు, బస్సు, మెట్రోలో రీల్స్‌ చేస్తూ ఫేమస్‌ అవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇందుకోసం తోటి ప్రయాణికులు ఇబ్బందుపడుతున్నాసరే వారు మాత్రం ఆనందాన్ని తాము వెతుక్కుంటున్నారు. రకరకాల స్టంట్స్‌, చిత్ర విచిత్ర పనులు చేస్తూ రీల్స్‌ తయారు చేస్తున్నారు. అయితే, వీటన్నింటిలో కొందరు చాలా ప్రతిభను చూపిస్తున్నారు. ప్రస్తుతం.. అలాంటి ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీ మతిపోతుంది.ఎందుకంటే.. సాధారణంగా మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిని చూసి తోటి ప్రయాణికులు, నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తుంది. కానీ, ఇది చూస్తే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. అయితే వీరి వీడియో మేకింగ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. వైరల్‌ వీడియోలో ఇద్దరు యువకులు మెట్రోలో విన్యాసాలు చేస్తున్నారు. మెట్రో రైల్లో ఒక వ్యక్తి కూర్చున్న తీరు, అవతలి వ్యక్తి చేస్తున్న పనులు చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.

వైరల్ గా మారిన వీడియోలో.. చాలా మంది ప్రయాణికలు మెట్రోలో కూర్చుని ఉండటం కనిపిస్తుంది. కానీ మధ్యలో ఈ ఇద్దరు యువకులు మాత్రం స్టంట్స్‌ చేస్తూ కనిపించారు. ఇందులో ఒక యువకుడు మెట్రో మధ్యలో ఉండే రాడ్‌ని సీటుగా మార్చుకుని కూర్చున్నాడు. అదేలాగో మాటల్లో చెప్పలేం.. ఇదిలా ఉంటే.. అది కూడా ఎలాంటి ఆధారం లేకుండానే. అంతలో మరో యువకుడు చేతిలో టోపీతో రాడ్‌పై బ్యాక్‌ఫ్లిప్ చేశాడు. వారిద్దరూ కలిసి చేస్తూ విన్యాసాలు చూపరులను అలాగే చూస్తుండిపోయేలా చేసింది. అతని బ్యాక్‌ఫ్లిప్ మీ కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. అది చూసి మెట్రోలో కూర్చున్న చాలా మంది షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by @sidewalksagas

ఈ వీడియో ‘sidwalksagas’ అనే ఖాతా ద్వారా షేర్ చేయబడింది. ఇక అప్పటి నుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు వేలల్లో లైక్‌లు, షేర్లు వచ్చాయి. పలువురు పలు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ..