బాగా… కష్టపడి జస్ట్‌ పాసైన కొడుకు.. ఆనందంలో తేలిపోయిన తల్లిదండ్రులు

ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందించారు.. వారి కుటుంబంలో SSC ఉత్తీర్ణత సాధించిన మొదటి కుటుంబ సభ్యుడు ఇతడే కావొచ్చు అంటున్నారు. ఇదే వారి కుటుంబానికి గర్వకారణం అంటున్నారు. విశాల్‌ తల్లిదండ్రుల ఉత్సాహాన్ని చూసి సోషల్‌మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బాగా... కష్టపడి జస్ట్‌ పాసైన కొడుకు.. ఆనందంలో తేలిపోయిన తల్లిదండ్రులు
35 Marks In All Subjects
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 09, 2023 | 8:13 AM

ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరుకుంటారు. ప్రస్తుతం విద్యావ్యవస్థలో విపరీతమైన పోటీ నెలకొని ఉంది. అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు ఉన్న విద్యా సంస్థల్లోనే చదివించాలని, వారు ఏ పరీక్షలోనైనా వందకు వంద మార్కులు సాధించాలని పేరెంట్స్‌ కోరుకుంటారు. ఇక పిల్లలు తల్లిదండ్రుల అంచనాలను అందుకోకపోతే వారు ఏ మాత్రం భరించలేరు. కొందరు పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తమ కోపాన్నంత పిల్లలపై ప్రదర్శిస్తారు. లేదంటే, సదరు విద్యా సంస్థ అసమర్థతగా నిందిస్తారు. ఇంకొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడేది లేదంటూ బెదిరింపులకు దిగుతుంటారు. కానీ, పరీక్షాల్లో తక్కువ మార్కులు వచ్చిన పిల్లల్ని క్షమించి సంబరాలు చేసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు చెప్పండి….కానీ, అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో. ముంబయి లో జరిగింది. థానేకు చెందిన ఓ కుటుంబం ఇలాంటి వేడుకను జరుపుకుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. వారి కుమారుడు అన్ని సబ్జెక్టుల్లోనూ 35 శాతం మార్కులు మాత్రమే సాధించాడు.

మహారాష్ట్రలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లల ఫలితాలను చెక్‌ చేసుకున్నప్పుడు వారి ఆనందం ఆకాశాన్ని తాకింది. విశాల్ అశోక్ కరాడే అనే విద్యార్థి కూడా ఇటీవలే 10వ తరగతి పరీక్ష రాశాడు. అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులు మాత్రమే సాధించాడు. అయినా కూడా ఆ తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు. పైగా తమ కొడుకు కష్టపడి ఈ మార్కులు సాధించాడని ఆనందపడుతూ సంబరం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరాఠీ మాధ్యమంలో చదివిన విశాల్‌..ప్రస్తుతం థానేలో ఉంటున్నాడు. విశాల్ తండ్రి ఆటో రిక్షా నడుపుతుంటాడు. తల్లి ఇంటి పని చేస్తుంది. కానీ, ఈ తల్లిదండ్రుల కల తమ పిల్లలు బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ కష్టపడుతున్నారు.

కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందించారు.. వారి కుటుంబంలో SSC ఉత్తీర్ణత సాధించిన మొదటి కుటుంబ సభ్యుడు ఇతడే కావొచ్చు అంటున్నారు. ఇదే వారి కుటుంబానికి గర్వకారణం అంటున్నారు. విశాల్‌ తల్లిదండ్రుల ఉత్సాహాన్ని చూసి సోషల్‌మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ..