రేయ్ ఎవర్రా మీరంతా.. ఇలా తగులుకున్నారు.. ! మీలాంటి వారి వల్లే మెట్రో ఆలస్యం అవుతుంది..

చాలా మంది యువతీ యువకులు రిల్స్ కోసం మెట్రోలో ఏదో ఒక పని చేస్తున్నారు. ప్రతి రోజూ ఇలాంటి వీడియోలు కనీసం ఒక్కటైన సోషల్ మీడియాలో చేరి వైరల్‌ అవుతున్నాయి. ఈ సారి ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు కుర్రాళ్లు అలాంటి ఫీట్ చేయడం చూసి జనం ఆగ్రహంతో మండిపోతున్నారు.

రేయ్ ఎవర్రా మీరంతా.. ఇలా తగులుకున్నారు.. ! మీలాంటి వారి వల్లే మెట్రో ఆలస్యం అవుతుంది..
Delhi Metro
Follow us

|

Updated on: Jun 09, 2023 | 9:00 AM

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడానికి మెట్రో మార్గంగా మారింది! చాలా మంది యువతీ యువకులు రిల్స్ కోసం మెట్రోలో ఏదో ఒక పని చేస్తున్నారు. ప్రతి రోజూ ఇలాంటి వీడియోలు కనీసం ఒక్కటైన సోషల్ మీడియాలో చేరి వైరల్‌ అవుతున్నాయి. ఈ సారి ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు కుర్రాళ్లు అలాంటి ఫీట్ చేయడం చూసి జనం ఆగ్రహంతో మండిపోతున్నారు. మెట్రో తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయని మనకు తెలుసు. దీని వల్ల ఎవరైనా పొరపాటున రెండు డోర్ల మధ్యకి వస్తే అవి తెరుచుకుంటాయి. ఎటువంటి ప్రమాదం జరగదు గానీ, మెట్రో ముందుకు సాగదు. తిరిగి డోర్‌ దానికదే మూసుకున్న తర్వాత ట్రైన్‌ కదులుతుంది. కానీ, ఇక్కడ యువకులు చేసినతో ట్రైన్‌ ఎంతకీ కదలటం లేదు.. అదేలాగో వైరల్‌ వీడియోలో చూసి మీకే అర్థమవుతుంది.

20 సెకన్ల నిడివిగల ఈ వీడియో ఢిల్లీ మెట్రోలో జరిగినట్టుగా సమాచారం. ఢిల్లీ కోచ్‌లో సరదాగా గడుపుతున్న కొందరు యువకులు కనిపించారు.. కరోల్ బాగ్ స్టేషన్ వద్ద మెట్రో రైలు ఆగి ఉంది. దాని తలుపులు క్లోజ్‌ అయిన వెంటనే..అందులోని ఇద్దరు యువకులు..తమ కాళ్లను అడ్డుగా పెట్టి ట్రైన్‌ డోర్‌ తిరిగి తెరుచుకునేలా చేశారు. అంతటితో ఆగలేదు.. పదే పదే రెండు మూడు సార్లు ఇలాగే చేస్తూ పోయారు. ట్రైన్‌ కదిలే సమయానికి కాళ్లు అడ్డుగా పెడుతూ మెట్రో ప్రయాణానికి బ్రేక్‌ వేస్తూ వచ్చారు. అలా చేస్తూ వాళ్లంతా పగలబడి నవ్వుకున్నారు. యువకులు చేసిన పనితో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘ansh’ (gupta_ansh172) మార్చి 29న పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ అమన్ (@imb0yaman) జూన్ 8న పోస్ట్ చేసారు. DMRCని ట్యాగ్ చేసి ఇలా వ్రాశారు – ఇలాంటి వ్యక్తుల వల్ల మెట్రో ఆలస్యం అవుతుందంటూ క్యాప్షన్‌ రాశారు. ఢిల్లీ మెట్రో రైల్‌కు సంబంధించిన ఈ వీడియో.. 11.7 వేల వ్యూస్, 60 లైక్‌లు సాధించింది. దీనిపై ‘ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ సహా సామాన్యులు కూడా స్పందించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొందరు నెటిజన్లు కోరుతున్నారు. భారీ జరిమానాలు కూడా విధించాలన్నారు. DMRC స్పందిస్తూ.. దయచేసి కోచ్ నంబర్‌ను చెప్పాలంటూ కోరారు..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!