AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16000 గుండె ఆపరేషన్లు చేసిన యువ డాక్టర్కే హార్ట్‌ఎటాక్‌.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

గత కొన్నేళ్లుగా చాలా మంది యువ సెలబ్రిటీలు, సహా సాధారణ యువకులు, చిన్నారులు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒక నివేదిక మేరకు.. యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. ఇంకా ఇలాంటి అనేక కారకాలు గుండెపోటు ప్రమాదాలను పెంచుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు...

16000 గుండె ఆపరేషన్లు చేసిన యువ డాక్టర్కే హార్ట్‌ఎటాక్‌.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
heart attack
Jyothi Gadda
|

Updated on: Jun 09, 2023 | 9:50 AM

Share

తన కెరీర్‌లో 16 వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు చేసిన యువ వైద్యుడు గౌరవ్ మరణంతో అందరూ షాక్ అవుతున్నారు. యువతలో హార్ట్‌ఎటాక్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డాక్టర్ గౌరవ్ గాంధీ కేవలం 41 సంవత్సరాల వయస్సులో 16,000 కంటే ఎక్కువ గుండె శస్త్రచికిత్సలు చేసి అనేక మంది ప్రాణాలను కాపాడిన యువ కార్డియాలజిస్ట్. కానీ, తనకే ఆ కష్టం వచ్చినప్పుడు అతను తన ప్రాణాలను కాపాడుకోలేకపోయాడు. అతను గుండెపోటుతోనే మరణించాడు.

గుజరాత్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు గాంధీ తన ఇంట్లోనే బాత్రూమ్‌లో కుప్పకూలిపోయాడు. వెంటనే జీజీ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రికి చేరుకున్న 45 నిమిషాల్లోనే అతడు మృతి చెందాడు. డాక్టర్ గాంధీ సోమవారం ఎప్పటిలాగే రోగులను కలుసుకున్నారు. ఆ రాత్రికి నగరంలోని ప్యాలెస్ రోడ్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చారు. ఎలాంటి ఫిర్యాదులు, ప్రవర్తనలో కూడా ఎలాంటి మార్పులు లేకుండా భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కుటుంబ సభ్యులు అతన్ని లేపేందుకు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించి హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ గాంధీ ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు.

అంత గొప్ప డాక్టర్‌ ఇంత చిన్నవయసులోనే, అది గుండెపోటుతో మరణించడం పట్ల అందరూ దిగ్భ్రాంతి చెందారు. కానీ, ఒక్క ప్రశ్న మాత్రం అందరినీ సందేహంలో పడేస్తుంది. యువతలో గుండెపోటు కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? గత కొన్నేళ్లుగా చాలా మంది యువ సెలబ్రిటీలు, సహా సాధారణ యువకులు, చిన్నారులు కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒక నివేదిక మేరకు.. యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన జీవనశైలి. ఇంకా ఇలాంటి అనేక కారకాలు గుండెపోటు ప్రమాదాలను పెంచుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు…

ఇవి కూడా చదవండి

– ధూమపానం

– మద్యపానం

– ఒత్తిడి, ఆందోళన

టైప్‌-2 మధుమేహం

– అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు

– అధిక కొలెస్ట్రాల్

– అధిక రక్త పోటు

గుండెపోటుకు ముందదు మీలో కొన్ని లక్షణాలు, సంకేతాలు కనిపిస్తాయి. పొరపాటున కూడా ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. సకాలంలో వైద్య సహాయం పొందడం ద్వారా గుండెపోటుకు చికిత్స చేయవచ్చు. ఇటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి గుండెపోటుకు ముందు అనుభూతి చెందుతారు.. అయితే, ఈ లక్షణాలలో కొన్ని ఇతర సమస్యలతో సమానంగా ఉండవచ్చు. కానీ, మీరు వాటిని విస్మరించకూడదు.

– ఛాతీ నొప్పి, అసౌకర్యం

– విపరీతమైన నిరసం, బలహీనత

– దవడ, మెడ, వెన్నునొప్పి

– భుజం నొప్పి, వెన్నునొప్పి

– శ్వాస ఆడకపోవటం

మహిళల్లో గుండెపోటు లక్షణాలు: పైన పేర్కొన్న లక్షణాలు సాధారణంగా అన్ని వ్యక్తులలో కనిపిస్తాయి. కొన్ని ఇతర లక్షణాలు ముఖ్యంగా స్త్రీలలో కనిపిస్తాయి. మహిళల్లో కనిపించే లక్షణాలు వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పి.

గుండె ఆగిపోవడం, గుండెపోటు, స్ట్రోక్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెదడు, గుండె నరాల్లో అడ్డుపడటం వల్ల ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు మీ గుండె పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటే, మీరు ఎప్పటికప్పుడు వైద్యులు సూచించిన అన్ని టెస్టులు చేయించుకోవటం తప్పనిసరి అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం