AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding: పెళ్లయ్యే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి..? ఆసక్తికర విషయాలు మీకోసం..

ఫ్రెండ్స్.. కుటుంబసభ్యులు.. ఇంట్లో పెద్దలు ఇలా.. ఎవరితోనైనా మీ వివాహం గురించి చర్చ సాగినప్పుడు అనేక అంశాలు చర్చిస్తారు.. అన్నింటిలో మొదటిది ఇద్దరి మధ్య వయస్సు అంతరం ఎంత.. అమ్మాయి.. అబ్బాయి కంటే పెద్దదా..? చిన్నదా..?

Wedding: పెళ్లయ్యే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి..? ఆసక్తికర విషయాలు మీకోసం..
Wedding
Shaik Madar Saheb
|

Updated on: Mar 30, 2023 | 1:18 PM

Share

ఫ్రెండ్స్.. కుటుంబసభ్యులు.. ఇంట్లో పెద్దలు ఇలా.. ఎవరితోనైనా మీ వివాహం గురించి చర్చ సాగినప్పుడు అనేక అంశాలు చర్చిస్తారు.. అన్నింటిలో మొదటిది ఇద్దరి మధ్య వయస్సు అంతరం ఎంత.. అమ్మాయి.. అబ్బాయి కంటే పెద్దదా..? చిన్నదా..? అయితే.. ఏజ్ గ్యాప్ ఎంత ఉంది.. అనే విషయాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. వివాహాన్ని నిర్ణయించేటప్పుడు ఈ అంశాన్ని ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య నిర్ణీత వయస్సు అంతరం ఉండటం చాలా ముఖ్యమని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. అలా జరగకపోతే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎక్కువ అవుతాయని.. అవి జీవితాంతం వెంటాడుతాయని పెద్దలు పేర్కొంటుంటారు. అటువంటి పరిస్థితిలో భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం ఎంత అవసరమో ఈ రోజు మనం తెలుసుకుందాం..

అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలి..

పురాతన సంప్రదాయం ప్రకారం.. అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉండాలని చెబుతారు. అయితే ఇద్దరి మధ్య వయసు తేడా ఎంత ఉంటుందో ఎవరూ చెప్పలేదు. అబ్బాయి-అమ్మాయి వయస్సు మధ్య తేడా ఎలా ఉండాలి.. పరిశోధకులు చెప్పిన ఆసక్తికర విషయాలేంటో లుక్కెయండి..

5 నుంచి 7 సంవత్సరాల మధ్య వ్యత్యాసం: సాధారణంగా భార్యాభర్తల మధ్య 5 నుంచి 7 సంవత్సరాల వయస్సు అంతరం ఉండాలి. దీనిపై చాలా పరిశోధనలు కూడా జరిగాయి. వివిధ వయసుల అబ్బాయిలు, అమ్మాయిల ఆలోచనల్లో చాలా తేడా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ వ్యక్తులు కూడా ఒకరికొకరు చాలా శ్రద్ధ వహిస్తారు. ఒకరి విషయాలను మరొకరు ఎలా చూసుకోవాలో వారికి బాగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..

దంపతుల మధ్య 1 సంవత్సరం వయస్సు అంతరం ఉంటే, వారి మధ్య విడాకులు తీసుకునే అవకాశం 3 శాతం ఉంటుందని కూడా ఒక అధ్యయనంలో ప్రస్తావనకు వచ్చింది. 5 సంవత్సరాల వయస్సు అంతరం ఉన్న జంటలు విడాకులు తీసుకునే అవకాశం 18%, 10 సంవత్సరాల వయస్సు గ్యాప్ కోసం 39%, 20 సంవత్సరాల వయస్సు గ్యాప్ ఉన్న వారు 95% ఉంటుందని అధ్యయనం పేర్కొంది.

దూరం ఎంత తక్కువగా ఉంటే అంత సమన్వయం..

భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం.. ఎంత తక్కువగా ఉంటే.. అంత సమన్వయం బాగుంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇద్దరి మధ్య సమన్వయం కూడా అంతే మంచిగా ఉంటుందని.. వీరి మధ్య విడాకుల అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పేర్కొంది. శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే.. భార్యాభర్తల మధ్య సంబంధంలో భర్త వయస్సు ఎక్కువగా ఉండటం చాలా అవసరం.. ఎందుకంటే అబ్బాయి పరిపక్వత పొందుతాడు.. అప్పుడే అతను అమ్మాయికి సంబంధించిన అన్ని బాధ్యతలను అర్థం చేసుకోగలడని అధ్యయనం తెలిపింది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం..