టాయ్‌లెట్ కోసం మధ్యలో కారు ఆపిన భర్త.. భార్యను మర్చిపోయి అలాగే వెళ్లిపోయాడు.. కట్ చేస్తే సీన్ సితారే..
పెళ్లి తరువాత పురుషులకు మతిమరుపు సమస్య అధికమవుతుందని అంటుంటారు. ముఖ్యంగా పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవం వంటి చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటారు.

పెళ్లి తరువాత పురుషులకు మతిమరుపు సమస్య అధికమవుతుందని అంటుంటారు. ముఖ్యంగా పుట్టిన రోజులు, వివాహ వార్షికోత్సవం వంటి చిన్న చిన్న విషయాలను మర్చిపోతుంటారు. అయితే, థాయ్‌లాండ్‌కు చెందిన ఓ భర్త మాత్రం ఏకంగా తన భార్యనే మర్చిపోయాడు. టాయ్‌లెట్ కోసం వెళ్లి.. తన భార్యను మర్చిపోయాడు. ఆతను ఇచ్చిన ట్విస్ట్‌కు ఆమె దాదాపు 20 కిలోమీటర్లు ఒంటరిగా నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బూన్‌తోమ్ చైమూన్(55), అతని భార్య అమ్నుయే చైమూన్(49) ఇద్దరూ కలిసి న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ని తమ స్వగ్రామంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందలో భాగంగా జంటగా కలిసి కారులో వెళ్లారు. అయితే, కొంత దూరం వెళ్లిన తరువాత భర్త మూత్ర విసర్జన కోసం రోడ్డు పక్కన ఆపాడు. ఆ తరువాత అతను కారు దిగి మూత్ర విసర్జన చేసి వచ్చాడు. అయితే, కారులోంచి అతని భార్య కూడా బయటకు దిగింది. ఆ విషయం గమనించని భర్త.. ఆమెను అక్కడే వదిలేసి కారులో వెళ్లిపోయాడు.
అయితే, విశ్రాంతి కోసం కారు దిగిన అమ్నువే తిరిగి వచ్చేసరికి, ఆమె భర్త అప్పటికే కారులో వెళ్లిపోయాడు. ఆమెను చీకట్లోనే వదిలేసి వెళ్లాడు. తొలుత భయపడినప్పటికీ.. దిక్చుతోచని స్థితిలో నడుచుకుంటూ రోడ్డుమార్గంలో బయలుదేరింది. సుమారు 20 కిలోమీటర్లు నడనిచిన తరువాత ఓ పట్టణానికి చేరుకుంది. అక్కడ పోలీసుల సహాయం తీసుకుంది. తన భర్త ఫోన్ నెంబర్ గుర్తుకులేదని, బ్యాగ్ కూడా కారులో పెట్టానని వాపోయింది. దాంతో.. అధికారులు ఆమెకు సహాయం అందించారు. పోలీసులు.. ఎట్టకేలకు ఆమె భర్త జాడను కనిపెట్టారు. అప్పటికే అతను 159.6 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయాడు. అధికారుల సాయంతో చివరకు ఆమె.. తన భర్తను కలిసింది. మళ్లీ ఇద్దరూ కలిసి హాయిగా కారులో వెళ్లిపోయారు.




మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..