Viral News: లోదుస్తులు కొనడం మానేస్తున్న జనాలు.. డేంజర్ అని హెచ్చరిస్తురన్న నిపుణులు..
లోదుస్తులు అవసరమైన దుస్తులుగా పేర్కొంటారు. లోదుస్తులు ధరించడం రోజువారీ దినచర్య, అలవాటును అనుసరించడం లాంటిది. ఇతర దుస్తుల మాదిరిగానే.. లోదుస్తులు కూడా మన జీవనశైలిలో ముఖ్యమైన భాగం. లోదుస్తులు ధరించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది కాస్త వింతగా అనిపించినా ఇది నిజం. అయితే, లోదుస్తులకు సంబంధించి ఇటీవల వచ్చిన ఒక నివేదిక అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఈ నివేదిక ప్రకారం.. ఈ మధ్య కాలంలో ప్రజలు లోదుస్తులను కొనుగోలు చేయడం లేదట. దీంతో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని నివేదికలో పేర్కొన్నారు.

లోదుస్తులను ఎందుకు కొనడం లేదు?
జనాలు లోదుస్తులను కొనుగోలు చేయకపోవడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం పెరగడమే అని చెబుతున్నారు నిపుణులు. ద్రవ్యోల్బణం పెరగడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా.. ప్రజలు తమ బడ్జెట్ నుండి లోదుస్తుల వంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడం మానేశారట. గణాంకాల ప్రకారం, డిసెంబర్ 2022 చివరి త్రైమాసికంలో, లోదుస్తుల వాడకంలో 55 శాతం వరకు తగ్గుదల కనిపించింది.
ప్రజలు లోదుస్తులను కొనుగోలు చేయకపోవడానికి గల కారణాలలో ఒకటి.. వారిలో ఎక్కువ మంది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల సహాయం తీసుకోవడం, వాటి ద్వారా వారికి ఆఫర్లు కూడా లభిస్తాయి. ఆఫ్‌లైన్ స్టోర్‌లలో డిస్కౌంట్‌లు అందకపోవడం కూడా ఒక కారణంగా నివేదికలో పేర్కొన్నారు.
ఆరోగ్యం దెబ్బతింటోంది..
కానీ లోదుస్తులు కొనుగోలు చేయకపోవడంతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. అనేక రకాల సమస్యల నుంచి లోదుస్తులు రక్షిస్తాయని పలువురు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాధుల సంక్రమణ నుంచి రక్షణ..
లోదుస్తులు ధరించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. క్రోచ్ రాట్ అనేది తడి బట్టలు ధరించడం వల్ల సంభవించే ఒక రకమైన చర్మ వ్యాధి. చాలా సార్లు, మన ప్యాంటు చెమట వల్ల తడిగా మారినప్పుడు, లోదుస్తులు ప్యాంటు లోపలికి తేమను నిరోధిస్తాయి.
లీకేజీ..
లోదుస్తులు ధరించడం వల్ల అవాంఛిత లీకేజీ నుండి రక్షణ లభిస్తుంది. అయితే, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, అవాంఛిత లీకేజీ సర్వసాధారణం. లోదుస్తులు ధరించినట్లయితే మీకు ఎటువంటి సమస్య ఉండదు. ఇది కాకుండా, లోదుస్తులు అదనపు చెమటను గ్రహించడంలో, రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..