AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమలను ఎక్కువగా ఆకర్షించే బ్లడ్ గ్రూప్ ఏదో మీకు తెలుసా..?

దోమలు మన రక్తాన్ని తాగుతాయి.. దాని వల్ల చాలా జబ్బులు వస్తాయని మనలో చాలా మందికి తెలుసు. కానీ అందరూ ఒకేలా దోమల బారిన పడతారా..? అసలు దోమలు అన్ని బ్లడ్ గ్రూప్‌ ల వారినీ సమానంగా కుడతాయా..? లేదా దోమలకు ఇష్టమైన కొన్ని బ్లడ్ గ్రూప్‌లు ఉంటాయా అనే విషయాలపై పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దోమలను ఎక్కువగా ఆకర్షించే బ్లడ్ గ్రూప్ ఏదో మీకు తెలుసా..?
Mosquito
Prashanthi V
|

Updated on: Aug 01, 2025 | 8:01 AM

Share

మన శరీరాలను దోమలు సులభంగా గమనించి రక్తాన్ని తాగుతాయి. అయితే దోమలు ప్రతి ఒక్కరినీ ఒకేలా కాకుండా.. కొన్ని ప్రత్యేక బ్లడ్ గ్రూప్‌ ల వారినే ఎక్కువగా ఎంచుకుంటాయట. ఇది కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. మనం ఏ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నామో తెలుసుకుంటే.. దోమల బారిన పడే అవకాశాలు ఎంత ఉంటాయో అంచనా వేసుకోవచ్చు.

దోమలు ముఖ్యంగా నిలిచిన నీటిలో పెరిగి, గుడ్లు పెడతాయి. చాలా జబ్బులను వ్యాపింపజేస్తాయి. వర్షాకాలంలో దోమల సంఖ్య చాలా పెరుగుతుంది. దీని వల్ల మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా లాంటి ప్రమాదకర జబ్బులు వేగంగా వస్తాయి.

దోమలకు ఇష్టమైన బ్లడ్ గ్రూప్స్

మన బ్లడ్ గ్రూప్స్‌ని.. A, B, AB, O అని నాలుగు రకాలుగా విభజించారు. వాటిలో కొన్ని బ్లడ్ గ్రూప్‌ల వారినే దోమలు ఎక్కువగా ఇష్టపడతాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే O బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని దోమలు చాలా ఇష్టపడతాయి. ఇది ప్రపంచంలోనే ఎక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్ కావడం వల్ల దోమలకు ఎక్కువగా ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులపై దృష్టి ఉంటుంది.

O తర్వాత B బ్లడ్ గ్రూప్ ఉన్నవారినీ దోమలు తరచూ ఇష్టపడతాయి. ఈ రెండు రకాల వారినే దోమలు ఎక్కువగా కుట్టే అవకాశముంది. కానీ ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. A బ్లడ్ గ్రూప్ కలిగిన వారిని దోమలు అంతగా పట్టించుకోవు. దోమలు ఈ బ్లడ్ గ్రూప్‌ని పెద్దగా ఇష్టపడవు. అందువల్ల A బ్లడ్ గ్రూప్ కలిగిన వారికి దోమల నుండి కొంత రక్షణ ఉంటుంది.

దోమల నుండి రక్షణకు చిట్కాలు

మీ బ్లడ్ గ్రూప్ ఏదైనా సరే.. దోమల నుండి రక్షణగా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. నిలిచిన నీటిని తొలగించండి. దోమలను దూరం ఉంచే స్ప్రేలు, నెట్స్ వాడండి.