Telangana: ఏదో కీడు జరుగుతుంది.. వాటిని చూస్తేనే గజగజ వణికిపోతున్న గ్రామస్తులు..!

ఆ గ్రామంలో అడుగు పెట్టగానే పక్షులు దర్శనమిస్తాయి. గుంపులు గుంపులు తిరుగుతున్నాయి. చెట్టు కనబడితే చాలు వాలిపోతున్నాయి. అయితే.. అవి ఉంటే ఊరికి కీడు సోకుతుందనే ప్రచారం జరుగుతుంది. దానికి తోడు.. ఏదైనా వైరస్ సోకుతుందనే భయం వెంటాడుతోంది.

Telangana: ఏదో కీడు జరుగుతుంది.. వాటిని చూస్తేనే గజగజ వణికిపోతున్న గ్రామస్తులు..!
Bats
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 21, 2024 | 12:17 PM

ఆ గ్రామంలో అడుగు పెట్టగానే పక్షులు దర్శనమిస్తాయి. గుంపులు గుంపులు తిరుగుతున్నాయి. చెట్టు కనబడితే చాలు వాలిపోతున్నాయి. అయితే.. అవి ఉంటే ఊరికి కీడు సోకుతుందనే ప్రచారం జరుగుతుంది. దానికి తోడు.. ఏదైనా వైరస్ సోకుతుందనే భయం వెంటాడుతోంది. గ్రామం నిండా నిండిపోయిన గబ్బిలాలు ఉన్నా ఆ గ్రామం గురించి ఒక్కసారి తెలుసుకుందాం..!

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రామునిపల్లి గ్రామంలో మర్రి చెట్టుపై కొన్ని సంవత్సరాలుగా గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా గ్రామంలో తిరుగుతూ విసర్జిస్తున్నాయి. దీంతో దుర్వాసనతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు గబ్బిలాలతో వైరస్ సోకి అనారోగ్యానికి గురవుతామోనని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు.

ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో తాటి, ఈత కల్లు అమ్ముకునే గీత కార్మికులకు ఈ గబ్బిలాలతో ఉపాధి కరువైంది. గబ్బిలాలు కల్లును సేవిస్తున్నాయి. గబ్బిలాలు ఎంగిలి చేసిన కల్లును తాగేందుకు కల్లు ప్రియులు ఇష్టపడడం లేదట. గ్రామంలో గబ్బిలాల విసర్జన ఇండ్లపైన, బావుల్లో పడడం మూలంగా తాగే నీరు సైతం కలుషితమవుతున్నాయి. దీంతో కొత్త రోగాలు ప్రభలుతాయని స్థానికలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు గబ్బిలాలను అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

అయితే.. ఇంట్లో గబ్బిలం వెళ్తే అరిష్టమని ఇప్పటికి నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో.. గబ్బిలం చొరబడితే ఉండేందుకు భయపడుతున్నారు. కరోనా సమయంలో ఈ చెట్ల దగ్గరికి వెళ్లాలంటే స్థానికులు భయపడ్డారు. ఈ గ్రామంలో వేలాది గబ్బిలాలు తిష్ట వేశాయి.. గబ్బిలాల బాధ నుంచి విముక్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..