Inspiration: ఎదురీత ముందు విధిరాత ఎంత!.. ఒకప్పుడు అవమానాలు, ఛీత్కారాలు.. ఇప్పుడు సన్మానాలు
మూడు అడుగులే ఉన్నావని ఎగతాళి చేశారు అందరు. కానీ అలా కామెంట్ చేసిన వారే శెభాష్ అంటున్నారు. ఎందుకంటే అతడు అంతటి ఘనత సాధించారు.
మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు అరుదైన ఘనత సాధించాడు. 3.3 అడుగులు ఉండే ప్రతీక్ విట్టల్ మోహితే గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకెక్కాడు. 2022 ఎడిషన్‌కు సంబంధించి ప్రపంచలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా రికార్డు సృష్టించాడు విట్టల్. గిన్నిస్ వెబ్‌సైట్ ప్రకారం విట్టల్ 2012లో బాడీబిల్డింగ్ మొదలుపెట్టాడు ప్రతీక్ విట్టల్ మోహితే. 3 అడుగుల నాలుగు ఇంచులు మాత్రమే ఉండటంతో చాలా మంది విట్టల్‌ను ఎగతాళి చేసేవారు. అలా ఎగతాళి చేసినవాళ్లే శభాష్ అనేలా మారాలని అనుకున్నాడు విట్టల్. బాడీబిల్డింగ్ చేద్దామనుకున్నాడు. కానీ జిమ్ పరికరాలు పెద్దగా ఉండటం వల్ల పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు ప్రతీక్ విట్టల్ మోహితే. అది చూసి చాలా మంది నవ్వేవారు. కానీ ఏది ఏమైనా సరే అనుకున్నది సాధించాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ను అందుకున్నాడు. గత మూడేళ్లలో మొత్తం 41 పోటీల్లో విట్టల్ పాల్గొన్నాడు. కొన్ని ఈవెంట్లకు అతిథిగా వెళ్లాడు. తనని ఒకప్పుడు ఎగతాళి చేసినవారే ఇప్పుడు తనను మర్యాదగా ఆహ్వానిస్తున్నారని అంటున్నాడు విట్టల్. ప్రతీక్ విట్టల్‌కు విజయం అంత సులువుగా దక్కలేదని,. అతని కృషి, పట్టుదల.. నేటి యువతకు ఆదర్శమని అన్నారు గిన్నిస్ వల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు. అతని కథ వింటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అనే నమ్మకం కలుగుతోందని కొనియాడారు.
2022 ఎడిషన్‌లో ఇతర విభాగాల్లో గిన్నిస్ రికార్డులు సాధించిన వాళ్ల వివరాలను సంస్థ వెల్లడించింది. ప్రపంచలోనే అత్యంత పొడవైన బాడీబిల్డర్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన ఓలివర్ రిచ్‌టర్స్ నిలిచాడు. ఆయన ఎత్తు 7.1 అడుగులు. మహిళల్లో అత్యంత పొడవైన బాడీబిల్డర్‌గా నెదర్లాండ్స్‌కు మరియా వాట్టెల్ రికార్డుల్లోకెక్కింది. ఆమె ఎత్తు 5.9 అడుగులు.
Also Read: ఏపీ మంత్రివర్గంలో ఎప్పుడైనా మార్పులు జరిగే అవకాశం! సీఎం జగన్ సంకేతాలు!