Will Writing: వీలునామా రాస్తున్నారా..? గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే…!
Will Writing: కరోనా మహ్మారి కాలంలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో ఎవ్వరు కూడా ఊహించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో..
Will Writing: కరోనా మహ్మారి కాలంలో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో ఎవ్వరు కూడా ఊహించలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో మరణ వీలునామాపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. తమపై ఆధారపడిన వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో సంపాదించుకున్న ఆస్తులను చట్టబద్దంగా పంచివ్వడానికి ఇది ఎంతో అవసరం కూడా. ఆస్తులు, సంపదపై హక్కులను ఇతరులకు బదిలీ చేయాలనే లక్ష్యంతో మరణానికి ముందు వ్యక్తులు రాసే లీగల్ డాక్యుమెంట్‌ను వీలునామా అంటారు. వీలునామా రేసేవారిని ‘టెస్టేటర్’ అంటారు. వ్యక్తుల వారసుల మధ్య వివాదాలను నివారించాలంటే టెస్టేటర్ విలునామాను పక్కాగా రాయాలి. తన ఆస్తిలో దేనిని కూడా వదిలేయకుండా డాక్యుమెంట్‌లో ప్రస్తావించడం ఎంతో మంచిది. విలునామా రాసేముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
టెస్టేటర్‌కు భాషపై పట్టు.. వీలునామా రాసే భాష టెస్టేటర్‌కి తెలిసిన ఉండాలి. అంతేకాకుండా అర్థం చేసుకోగలిగిన భాష అయి ఉండాలి. ఒకవేళ వేరే భాషలో రాస్తే.. ఆ వీలునామాను పూర్తిగా చదివి వినిపించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి టెస్టేటర్ తనకు బాగా నమ్మకస్తులైన వ్యక్తి సహాయం తీసుకున్నారని వీలునామాలో ప్రస్తావించాలి. అలాగే టేస్టేటర్‌కు సహాయం చేసిన వ్యక్తి సాక్షిగా కానీ, లేకపోతే కార్యనిర్వాహకులుగా గానీ, లేదంటే విలునామాలోని లబ్ధిదారునిగా కూడా ఉండవచ్చు.
ఈ విషయాలను ప్రస్తావించడం తప్పనిసరి.. తాజాగా రాస్తున్న వీలునామాలో టేస్టేటర్ ఇదే తన చివరి విలునామా అనే విషయాన్ని ప్రస్తావించాలి. ఇది ఇంతకుముందు రాసిన విలునామాలన్నింటి కంటే, వాటిల్లో చేసిన మార్పుల కంటే ముందు ఉంటుందని ప్రస్తావించాలి. తాజాగా రాసిన దాంట్లో.. గత విలునామాలు, కోడిసిల్స్ గురించి తప్పనిసరిగా ప్రస్తావించాల్సి ఉంటుంది. లేదంటే.. అనుమానాస్పద పరిస్థితుల్లో ఈ విలునామా తయారు చేశారని ఎవరూ నిరూపించకపోతేనే అది చెల్లుబాటు అవుతుంది. లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి.
ఈ వివరాలు తప్పనిసరి.. ఒకవేళ టెస్టేటర్ తన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా తన ఆస్తిని కానీ, అందులో భాగం కానీ ఇవ్వకూడదని అనుకుంటే.. ఎవరికి వాటా ఇవ్వకూడదు అనుకుంటున్నారనే వివరాలను తప్పనిసరిగా విలునామాలో రాయాలి. అయితే ఎందుకు ఇవ్వట్లేదనే కారణాన్ని తప్పనిసరిగా రాయాల్సిన అవసరం లేదు. విలునామాపై సాక్షులుగా సంతకం చేసే ఇద్దరు వ్యక్తులు లబ్ధిదారులు కాకూడదు. వీలునామాలో సాక్ష్యులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. టెస్టేటర్ మంచి జ్ఞానాన్ని కలిగి ఉన్నారని, ఎలాంటి బెదిరింపులకు, బలవంతానికి లోను కాలేదని, మత్తులో లేరని సాక్ష్యులే ధ్రువీకరిస్తారు. ప్రతి విలునామాలో కార్యనిర్వాహకుల పేరును ప్రస్తావించాలి. లేకపోతే లబ్ధిదారునికి పరిపాలనా పరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు విలునామాను అమలు చేయడానికి వాళ్లు లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసం కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది.
ఇవి కూడా చదవండి: