WhatsApp Mistakes: మీరు వాట్సాప్ వాడుతున్నారా..? ఈ తప్పులు చేస్తే కష్టాల్లో చిక్కుకున్నట్లే..!
WhatsApp Mistakes: ప్రస్తుతం ఉన్న రోజుల్లో వాట్సాప్ వాడని వారంటు ఉండరేమో. అయితే వాట్సాప్‌తో కూడా ఎన్ని లాభాలు ఉన్నాయో ....
WhatsApp Mistakes: ప్రస్తుతం ఉన్న రోజుల్లో వాట్సాప్ వాడని వారంటు ఉండరేమో. అయితే వాట్సాప్‌తో కూడా ఎన్ని లాభాలు ఉన్నాయో .. అన్ని చిక్కులు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించి వాట్సాప్ వాడుకుంటే మేలు.. లేకపోతే కేసులు.. జైలు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా పరిచయమైన వాట్సప్ ఆ తర్వాత ఎన్నో ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకుంటోంది. మొదట్లో వాట్సప్‌లో మెసేజెస్ మాత్రమే పంపేవాళ్లం. కానీ ఆ తర్వాత ఫోటోస్, ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ కూడా షేర్ చేసే అవకాశం లభించింది. ఇప్పుడు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ కూడా చేస్తున్నాము. వాట్సాప్‌లో రోజూ కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తుండటంతో చాలా మంది దీనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటున్నారు. అయితే వాట్సాప్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. మరి ఆ తప్పులేంటో తెలుసుకుందాం.
వాట్సాప్‌లో పోర్న్ క్లిప్స్ షేర్ చేయడం పెద్ద తప్పు. ఇది మిమ్మల్ని జైలు వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఈ విషయంలో వాట్సాప్ కఠిన నిబంధనలను రూపొందించింది. మీ ఖాతా బ్యాన్ చేసి, మీపై పోలీస్ ఫిర్యాదు కూడా ఇవ్వవచ్చు. ఇతరుల పేరు మీద వాట్సాప్ ఖాతా ఓపెన్ చేస్తే మీరు చిక్కుల్లో పడినట్లే. మీరు వాట్సాప్‌లో వచ్చిన సమాచారాన్ని నిజమో.. కాదో తెలుసుకోకుండా షేర్ చేసినట్లయితే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల చిక్కుల్లో పడ్డ ఎన్నో ఘటనలు జరిగాయి. అందుకే నకిలీ వార్తలను షేర్ చేయవద్దు. కులమతాలు, వర్గాలను రెచ్చగొట్టే పోస్టులు కూడా చేయవద్దు.
అయితే ఎవరు పడితే వారు మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. అయితే అలా గ్రూపుల్లో యాడ్ చేస్తున్నట్లయితే ప్రైవసీ సెట్టింగ్స్‌లో మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో పర్మిషన్ ఇవ్వొచ్చు. మీకు అవసరం లేని మెసేజెస్ సేవ్ చేయకండి. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌తో మీ వాట్సప్ మెసేజెస్ ఎప్పటికప్పుడు డిలిట్ అయ్యేలా సెట్టింగ్స్ చేయవచ్చు. అందుకే వాట్సాప్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది షేర్ చేయడం లాంటివి చేయవద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అందరికీ మా వాట్సప్ నెంబర్ ఇవ్వకండి. మీరు ఇటీవల కాలంలో కాంటాక్ట్‌లో లేనివాళ్ల నెంబర్స్ డిలిట్ చేయండి. రెండుమూడేళ్ల క్రితం మిమ్మల్ని వాట్సప్‌లో కాంటాక్ట్ అయినవారితో ఇప్పుడు ఎలాంటి పని ఉండకపోవచ్చు. అలాంటి నెంబర్స్ డిలిట్ చేయడం మంచిది. దీంతో మీ వాట్సప్ క్లీన్‌గా ఉంటుంది.
మీ ప్రొఫైల్ ఫోటో అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మీ ప్రొఫైల్ ఫోటో కనిపిస్తే చాలు. ప్రైవసీ సెట్టింగ్స్‌లో మీకు Everyone, My contacts, Nobody అనే ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ ఫోటో అందరికీ కనిపిస్తుంది. రెండో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కేవలం మీ కాంటాక్ట్స్‌కి మాత్రమే మీ ఫోటో కనిపిస్తుంది. మూడో ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీ ప్రొఫైల్ ఫోటో ఎవరికీ కనిపించదు. వాట్సప్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేయకపోవడం చాలా పెద్ద రిస్క్. ఈ ఆప్షన్ ఆన్ చేస్తే మీ వాట్సప్ అకౌంట్ భద్రంగా ఉంటుంది. మీ సిమ్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందంటే ఈజీగా వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే టూ-స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేస్తే మీరు అదనంగా పాస్‌వర్డ్ సెట్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి: