Fish: చేపలు తినే వారికి షాకింగ్ న్యూస్.. ఆ వ్యాధుల బారిన పడే అవకాశముందట.. వివరాలు..
Fish Disadvantages: చేపల వినియోగం చాలా ప్రయోజనకరం. అనేక అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది. ఎందుకంటే చేపల్లో
Fish Disadvantages: చేపల వినియోగం చాలా ప్రయోజనకరం. అనేక అధ్యయనాల్లో కూడా నిరూపితమైంది. ఎందుకంటే చేపల్లో ఒమేగా – 3 కొవ్వు (Omega-3 Fatty acid)ఆమ్లాలతో పాటు , అనేక ముఖ్యమైన విటమిన్లు (Vitamins), ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. చేపలను తినడం ద్వారా.. మెదడు కూడా చాలా చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు (Fish) సహకరిస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా చేపలను ఎక్కువగా తినాలని సిఫార్సు చేస్తుంటారు. అయితే.. చేపలు శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నప్పటికీ.. దాని వినియోగం కొన్నిసార్లు హానికరమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నీటిలో ఉండే పాదరసం, పీసీబీ వంటి రసాయనాలు కూడా చేపల కడుపులోకి వెళ్తాయి. మెర్క్యురీ, పిసిబిలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. నేరుగా, మీరు పెద్ద పరిమాణంలో చేపలను తింటే అది శరీరంలో పాదరసం, పీసీబీ మొత్తాన్ని పెంచుతుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చేపలు మన ఆరోగ్యం ఎలాంటి హని కలిగిస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
మెదడుపై ప్రభావం చేపలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పాదరసం లేదా పిసిబి పరిమాణం పెరిగితే.. అది మెదడు లేదా నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కావున పరిమిత పరిమాణంలో చేపలను తీసుకోవడం మంచిదని పేర్కొంటున్నారు నిపుణులు.
గర్భిణీలకు హానికరం శరీరంపై చేపల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. చేపలు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. కావున గర్భిణిలు కూడా పరిమిత పరిమాణంలో చేపలను తినడం మంచిది. గర్భిణీలు చేపలను ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. పరిమిత పరిమాణంలో చేపలు తినడం తల్లి, బిడ్డకు ఉపయోగకరమే కానీ.. తినేముందు వైద్యుడిని లేదా నిపుణుడిని సంప్రదించడం మంచిది.
క్యాన్సర్ చేపలు ఎక్కువగా తినే వారి శరీరంలో అధిక మొత్తంలో పీసీబీ ఉంటుంది. ఈ వ్యక్తులు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక పరిమాణంలో చేపలను తినడం ద్వారా శరీరంలో PCB పెరుగుతుంది. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
మధుమేహం చేపలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలోకి చేరిన విషపూరిత పదార్థాలు మధుమేహం సంభవించడానికి కారణమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుడా బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: