Eyes: కనురెప్పలు రాలి పోతున్నాయా.? ఈ సమస్యతో బాధపడుతున్నట్లే..
కంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి, అందాన్ని పెంచడంలో కంటి రెప్పులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దుమ్ము నుంచి కళ్లను రక్షించడంలో కను రెప్పుల పాత్ర ఎంతగానో ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కనురెప్పులు రాలిపోతుంటాయి. అయితే ఇలా కనురెప్పులు రాలిపోతుంటే వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్లే కను రెప్పలు రాలిపోతాయి...

మానవ అవయవాలలో కళ్లకు ఉన్న ప్రాధానత్య ఎలాంటితో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతుంటారు. ఇక కంటి ఆరోగ్యాన్ని కాపాడడానికి, అందాన్ని పెంచడంలో కంటి రెప్పులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. దుమ్ము నుంచి కళ్లను రక్షించడంలో కను రెప్పుల పాత్ర ఎంతగానో ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కనురెప్పులు రాలిపోతుంటాయి. అయితే ఇలా కనురెప్పులు రాలిపోతుంటే వెంటనే అలర్ట్ కావాలని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యల వల్లే కను రెప్పలు రాలిపోతాయి. ఇంతకీ కనురెప్పలు రాలడానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
* కను రెప్పలు రాలిపోవడానికి ప్రధాన కారణాల్లో థైరాయిడ్ హార్మోన్ లోపం ఒకటి. థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో వెంట్రుకలు బలహీనంగా మారుతాయి. హైపోథైరాయిడిజం కారణంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. కాబట్టి కను రెప్పలు రాలిపోతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
* మయస్తీనియా గ్రావిస్ అనే వ్యాధి కారణంగా కూడా కను రెప్పులు రాలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో కండరాలలో బలహీనత వల్ల ఈ వ్యాధి వస్తుంది. కండరాలు సరిగా పనిచేయకపోవడం, కనురెప్పలు రాలడం దీని ప్రధాన లక్షణంగా చెప్పొచ్చు.
* బెల్స్ పాల్సీ వ్యాధి కారణంగా కూడా కను రెప్పలు రాలుతాయని నిపుణులు చెబుతున్నారు. బెల్స్ పాల్సీ అనేది ముఖ నరాల సమస్య.. దీని కారణంగా కనురెప్పలు, ముఖ కండరాలలో బలహీనత ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా, నోరు, కనురెప్పలు, బుగ్గల కండరాలు బలహీనంగా మారుతాయి. ఈ కారణంగా కూడా కనురెప్పులు రాలిపోతాయి. కాబట్టి కను రెప్పలు రాలిపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..