Fear Effects: భయపడినప్పుడు.. శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా!
భయం.. ఇది సాధారణ భావన. అందరూ ఏదో ఒక సందర్భంగా భయ పడే ఉంటారు. అయితే కొంత మంది మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా చాలా భయపడి పోతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నారో వాళ్లకే తెలీదు. ఇంకొందరు హార్రర్ సినిమాలు చూసినప్పుడు, మరి కొందరు ఆర్థిక పరిస్థితులు, అప్పుల భయాలు ఇలా చాలా వాటికి భయ పడుతూ ఉంటారు. అయితే ఇలా భయ పడినప్పుడు శరీరంలో కొన్ని రకాల మార్పులు సంభవిస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి..

భయం.. ఇది సాధారణ భావన. అందరూ ఏదో ఒక సందర్భంగా భయ పడే ఉంటారు. అయితే కొంత మంది మాత్రం చిన్న చిన్న విషయాలకు కూడా చాలా భయపడి పోతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నారో వాళ్లకే తెలీదు. ఇంకొందరు హార్రర్ సినిమాలు చూసినప్పుడు, మరి కొందరు ఆర్థిక పరిస్థితులు, అప్పుల భయాలు ఇలా చాలా వాటికి భయ పడుతూ ఉంటారు. అయితే ఇలా భయ పడినప్పుడు శరీరంలో కొన్ని రకాల మార్పులు సంభవిస్తాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
శరీర పరంగా అనేక మార్పులు..
భయం అనేది కేవలం మనసుకే కాదు.. శరీర పరంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ప్రమాదం ఉందని తెలిసినప్పుడు అసాధారణంగా ఎవరికైనా భయం పుడుతుంది. భయానికి మూల కారణం మన బ్రెయిన్ లోనే ఉంటుందని సైన్స్ చెబుతోంది. జీవితంలో పలు సమస్యలు.. ఇలా వివిధ కారణాల వల్ల భయం పుడుతుంది. ఇలా భయ పడినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి.
ఆందోళన, ఒత్తిడికి దారి తీస్తుంది:
భయపడినప్పుడు గుండె అనేది వేగంగా కొట్టుకుంటుంది. శ్వాసలో కూడా మార్పులు ఉంటాయి. భయం వేసినప్పుడు బ్రెయిన్ చాలా అలర్ట్ అయిపోతుంది. దీంతో ఏం జరుగుతుందో అని టెన్షన్ మొదలై.. బ్రెయిన్ సరిగ్గా పని చేయదు. వివిధ రకాల ఆలోచనలు మొదలై.. ఆందోళన, ఒత్తిడికి దారి తీస్తాయి. ఇలా చాలా మంది భయ పడి.. ప్రాణాలు తీసుకుంటున్నారు.
భయం వలన ప్రాణాలే పోవచ్చు..
ఒక వ్యక్తి భయ పడినప్పుడు శరీరంలో ప్రత్యేకమైన హార్మోన్లు, రసాయనాలు విడుదల అవుతాయి. వీటిలో కార్టిసాల్, ఎపినెఫ్రైన్, నోర్ పైన్ ఫ్రైన్ ఉంటాయి. ఈ హార్మోన్లు శరీరంలో వివిధ విధులను నియంత్రిస్తాయి. భయం ఎక్కువై హార్ట్ రేటు పెరిగి.. ఒత్తిడి తీసుకోలేక గుండె పోటుతో మరణించిన వారు చాలా మంది ఉన్నారు. భయం వేసినప్పుడు కళ్లలోని నరాలు వ్యాకోచిస్తాయి.
నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి..
కండరాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా వేగంగా పెరుగుతుంది. దీంతో బాడీ స్టిఫ్ గా మారిపోయి.. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతీ విషయాన్ని సీరియస్ గా తీసుకోక పోవడమే బెటర్. చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకోకపోవమే మంచిది. భయాన్ని పక్కకు పెట్టి.. నెగిటివ్ ఆలోచనలు రాకుండా చూసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








