Vastu Tips: ఇవి బేసిక్‌ వాస్తు నియమాలు.. మీ ఇల్లు ఇలాగే ఉందో చెక్‌ చేసుకోండి..

వాస్తు నియమాలను పాటించే వారు మనలో చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా భారతీయులను, వాస్తును విడదీసి చూడలేం. ఇందుకోసమే వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు. అయితే ప్రతీ ఇంటి నిర్మాణంలో కచ్చితంగా కొన్ని బేస్ వాస్తు విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ బేసిక్ వాస్తు పాయింట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: ఇవి బేసిక్‌ వాస్తు నియమాలు.. మీ ఇల్లు ఇలాగే ఉందో చెక్‌ చేసుకోండి..
Basic Vastu Tips
Follow us

|

Updated on: Oct 26, 2024 | 12:11 PM

ఇంటి నిర్మాణంలో వాస్తుకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును ఎక్కువగా విశ్వసిస్తుంటారు. అందుకే నిర్మాణం మొదలు మొట్టగానే వాస్తు పండితుల సూచనలు పాటిస్తుంటారు. అయితే కచ్చితంగా ప్రతీ ఇంట్లో కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. ప్రతీ ఇంట్లో కనీసం పాటించాల్సిన వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటికి వచ్చిన అతిథులు కూర్చోవడానికి వాయువ్యం వైపు గదిని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు చెబుతోంది. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

* ఇక ఇంటికి మెయిన్‌ డోర్‌ ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉండడం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

* అదే విధంగా సింహ ద్వారా కింద ఒకటే డోర్‌ను ఏర్పాటు చేసుకుంటే. తలుపు కుడివైపు తెరుచుకునేలా చూసుకోవాలి. ఎడమవైపు తెరుచుకుంటే అది నెగిటివ్‌ ఎనర్జీకి దారి తీస్తుందని అంటున్నారు.

* ఇంట్లో పాటించాల్సిన బేసిక్‌ వాస్తు నియమాల్లో ఈశాన్యంలో మెట్లు ఉండకపోవడం ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం మూల ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిశలో మెట్లు ఉంటే అది ప్రమాదకరంగా భావించాలి.

* పొరపాటున కూడా ఆగ్నేయంలో బెడ్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోకూడదు. అగ్నికి సంకేతమైన ఆగ్నేయంలో బెడ్‌ రూమ్‌ ఉంటే అది దంపతుల మధ్య సఖ్యతపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

* ఇంట్లో రెండు డోర్‌లు ఎదురెదుగా ఉంటే కచ్చితంగా సమానంగా ఉండేలా చూసుకోవాలి. డోర్లు అసమానంగా ఉంటే నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు దిశల్లో మూతపడకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

* మరో బేసిక్‌ వాస్తు చిట్కాల్లో కిటికీలు ఒకటి. ఇంట్లో కిటికీలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు తెరుచుకునే ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..