Independence Day: ఆ గ్రామంలో 78 ఏళ్లుగా నిరంతరాయంగా ఎగురుతోన్న మువ్వన్నెల జెండా.. కారణం అదే!

ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగంతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశభక్తిని అలవర్చుకునేందుకు స్వాతంత్య్రం సాధించుకున్నప్పటి నుంచి అంటే 78 ఏళ్లుగా ఆ గ్రామంలో నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురుతూనే ఉంది.

Independence Day: ఆ గ్రామంలో 78 ఏళ్లుగా నిరంతరాయంగా ఎగురుతోన్న మువ్వన్నెల జెండా.. కారణం అదే!
National Flag
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Aug 15, 2024 | 1:24 PM

ఎంతోమంది వీరుల ప్రాణ త్యాగంతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశభక్తిని అలవర్చుకునేందుకు స్వాతంత్య్రం సాధించుకున్నప్పటి నుంచి అంటే 78 ఏళ్లుగా ఆ గ్రామంలో నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురుతూనే ఉంది. నిరంతరాయంగా మూడు రంగుల జాతీయ పతాకం ఎగురుతున్న గ్రామం ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్యలు గ్రామ చౌరస్తాలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి 78 ఏళ్లుగా మువ్వన్నెల పతాకాన్ని అవనతం చేయకుండా నిరంతరాయంగా రెపరెపలాడుతూనే ఉంది. నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసే ఆనవాయితీని ఇక్కడ గ్రామస్తులు కొనసాగించడం విశేషం.

దేశభక్తి, జాతీయ భావం స్ఫూర్తితో ఇక్కడ గ్రామస్తులు చందాలు వేసుకుని 1979లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. చిన్నారులు యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ నాయకుల స్మరణకు తోడు మువ్వన్నెల జెండాను ఎగురవేసే ఆనవాయితీని కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిఏటా పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, దసరా రోజున గ్రామ పెద్దలు పాతది తొలగించి, నూతన జాతీయ జెండాను అమర్చి ఎగుర వేస్తామని గ్రామస్తులు తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో మహనీయులు చేసిన ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. 78 ఏళ్లుగా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఆ గ్రామస్తులకు సెల్యూట్ చేయాల్సిందే..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..