AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Great Place to Work: ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే దేశంలో టాప్ పది సంస్థలు ఇవే

Great Place to Work: సాధారణంగా ఉద్యోగం కోసం చూసేవారు మంచి కంపెనీ కోసం చూస్తారు. జీతభత్యాలు బాగా ఉండటం.. పనిచేసే ప్రదేశంలో చక్కని వాతావరణం.. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందటానికి దొరికే అవకాశాలు ఇలా చాలా అంశాలు మంచి కంపెనీ ని నిర్ణయిస్తాయి.

Great Place to Work: ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే దేశంలో టాప్ పది సంస్థలు ఇవే
Great Place To Work
KVD Varma
|

Updated on: Jun 22, 2021 | 4:55 PM

Share

Great Place to Work: సాధారణంగా ఉద్యోగం కోసం చూసేవారు మంచి కంపెనీ కోసం చూస్తారు. జీతభత్యాలు బాగా ఉండటం.. పనిచేసే ప్రదేశంలో చక్కని వాతావరణం.. వ్యక్తిగతంగా అభివృద్ధి చెందటానికి దొరికే అవకాశాలు ఇలా చాలా అంశాలు మంచి కంపెనీ ని నిర్ణయిస్తాయి. అటువంటి కంపెనీలో ఉద్యోగం దొరకాలని చాలా మంది ప్రయత్నిస్తారు. అలా మన దేశంలో మంచి కంపెనీలుగా పేరుపడ్డ పది కంపెనీలు ఏవి ఉన్నాయో తెలుసుకుందాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోని అతి పెద్ద సంస్థగా చెబుతారు. అదే సమయంలో టాటా గ్రూప్ సంస్థకు పురాతన సంస్థగా మంచి గుర్తింపు ఉంది. ఇక పని విషయంలో డిహెచ్‌ఎల్, మహీంద్రా వంటి కంపెనీలు టాటా, రిలయన్స్ సరసన చేరాయి. ముంబయికి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ‘గ్రేట్ ప్లేసెస్ టు వర్క్’. ఈ సంస్థ దేశంలో మంచి సంస్థల జాబితాను విడుదల చేసింది. లాజిస్టిక్స్ కంపెనీ డీహెచ్ఎల్ ఎక్స్ప్రెస్ ఇండియా ఈ జాబితాలో మొదటి వరుసలో నిలిచింది. తరువాత మహీంద్రా గ్రూప్ చేరింది. మహీంద్రా గ్రూప్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సెక్టార్స్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

ఇక ఇంటూట్ ఇండియా, అయే ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సింక్రోని ఇంటర్నేషనల్ సర్వీసెస్ పని చేయడానికి అనుకూలంగా ఉండే సంస్థల జాబితాలో మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ఇంట్యూట్ ఇండియా మూడవ స్థానంలో, ఐ ఫైనాన్స్ నాలుగవ స్థానంలో, సింక్రొనీ ఇంటర్నేషనల్ ఐదవ స్థానంలో ఉన్నాయి. అదే సమయంలో, ఐటి కంపెనీ సిస్కో ఇండియా కూడా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది. సేల్స్ఫోర్స్, టెక్ రంగానికి చెందిన అడోబ్ వంటి సంస్థలను కూడా టాప్ 10 లో చేర్చారు. టాప్ టెన్ కంపెనీలో ఎక్కువ భాగం టెక్నో సంస్థలే.

ర్యాంకింగ్ ఎలా ఇస్తారంటే..

పని చేయడానికి అనుకూలంగా ఉండే సంస్థల జాబితాలో చేర్చడానికి, కంపెనీల అనేక పారామితుల ద్వారా పరిశీలిస్తారు. ఇందులో, మొదట ఉద్యోగుల అనుభవాల నాణ్యత చూస్తారు. తరువాత సంస్థ లో ఉద్యోగుల కోసం ఉండే పద్ధతులు కనిపిస్తాయి. ఇందులో నిలబడే సంస్థలకు ఈ టైటిల్ లభిస్తుంది. ముంబై రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అసెస్‌మెంట్ ప్రాసెస్‌లో సేకరించిన డేటాను ధృవీకరించడానికి బలమైన ప్రక్రియను అనుసరించిందని, దాని ఆధారంగా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసిందని పేర్కొంది. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఈ సూచీ విడుదల చేస్తారు. ఈ సూచీ ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లభించే ప్రయోజనాలే ఆధారంగా తయారు అవుతుంది. ఉద్యోగులకు సరైన భద్రతా ప్రమాణాలు పాటించే సంస్థలను ఎంపిక చేస్తారు. 2021 జాబితాలో, DHL పేరు ఈ సూచీలో అగ్రస్థానంలో ఉంది.

Also Read: Live-in Relationship:పెళ్లి వద్దు.. సహజీవనం ముద్దు.. పిల్లతో పాటు పెళ్లి చేసుకునే తల్లిదండ్రులు.. మనదేశంలోఎక్కడంటే

Viral Video: వరుడికి చుక్కలు చూపించిన చలాకీ వధువు.. ఏం చేసిందో తెలిస్తే నవ్వులు పువ్వులు.!