AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ.. చేతిగోటిపై దేశభక్తిని చాటుకున్న ఉపాధ్యాయడు!

కృషి.. పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపిస్తున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందరిలా మైక్రో ఆర్ట్ చేస్తే ఏం బాగుటుంది అనుకున్నాడు ఏమో..! భిన్నంగా ఏదో ఒకటి చేద్దామని సంకల్పించుకున్నాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు.

Independence Day: సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ.. చేతిగోటిపై దేశభక్తిని చాటుకున్న ఉపాధ్యాయడు!
Miniature Artist Janaiah Goud
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 09, 2024 | 4:21 PM

Share

కృషి.. పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని నిరూపిస్తున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అందరిలా మైక్రో ఆర్ట్ చేస్తే ఏం బాగుటుంది అనుకున్నాడు ఏమో..! భిన్నంగా ఏదో ఒకటి చేద్దామని సంకల్పించుకున్నాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు. చేతిగోటిపై చిన్న చిన్న బొమ్మలు గీస్తూనే, తన కళకు పదును పెట్టాడు. ఇంకా ఏదైనా ఉన్నతంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏకంగా మన భారత జాతి ఔనత్వాన్ని చాటి చెప్పాలనుకున్నాడు. చేతిగోటిపై వందేమాతరం గీతం చెక్కి అబ్బుర పరిచాడు.

నల్లగొండ జిల్లా కనగల్ మండలం బుడుమర్లపల్లి గ్రామానికి చెందిన గోటి చిత్రకారుడు కారింగు జానయ్య గౌడ్ ప్రతిభను కనబరుస్తున్నాడు. కనగల్ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్నారు జానయ్య గౌడ్. తన కళాత్మక చిత్రాలతో మరోసారి అబ్బురపరిచాడు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తన 9 సెం.మీ. పొడవు,1.5 సెం.మీ.ల వెడల్పు గల కుడి చేతి బొటనవేలి గోటిపై వందేమాతర గేయం తోపాటు, జాతీయ జెండాను చిత్రించి తన దేశభక్తిని చాటుకున్నాడు.

వేలు గోటి పరిమాణంలో తయారు చేసిన జాతీయ జెండా ఎంతగానో ఆకట్టుకుంటోంది. గతంలో వివిధ సామాజిక అంశాలపై చేతి గోటిపై పలు చిత్రాలను గీశాడు జానయ్య గౌడ్. ఇంతకుముందు వివిధ సందర్భాల్లో తన గోటిపై చిత్రాలను గీసి, అవార్డులను అందుకున్నాడు. మరోసారి తన సూక్ష్మ కళను ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..