Weight Lose: జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలా.? అయితే ఇది మీకోసమే.!

అధిక బరువు, ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య. బరువు తగ్గించుకోవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం, వ్యాయామం, వాకింగ్‌ పేరుతో పడరాని పాట్లు పడుతుంటారు. అయినప్పటికీ అనుకున్న మేరకు బొడ్డు కొవ్వు కరగకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కానీ, కొన్ని ఇంటి నివారణలు మీ బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును ఈజీగా కరిగిస్తాయని తెలుసా.?

Weight Lose: జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలా.? అయితే ఇది మీకోసమే.!

|

Updated on: Aug 09, 2024 | 4:45 PM

అధిక బరువు, ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య. బరువు తగ్గించుకోవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం, వ్యాయామం, వాకింగ్‌ పేరుతో పడరాని పాట్లు పడుతుంటారు. అయినప్పటికీ అనుకున్న మేరకు బొడ్డు కొవ్వు కరగకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కానీ, కొన్ని ఇంటి నివారణలు మీ బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును ఈజీగా కరిగిస్తాయని తెలుసా?

బరువు తగ్గించుకునే వారికి యోగా, వ్యాయామం, జిమ్ తప్పనిసరి అయినప్పటికీ, వీటిలో ఏవీ లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చు. కొన్ని సహజ డ్రింక్స్‌ మహిళలకు పెను సవాలుగా ఉండే పొట్ట కొవ్వును కరిగించడానికి ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల జీడిపప్పు పొడిని కలుపుకుని రోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల కడుపులో పేరుకున్న కొవ్వు వెన్నలా కరిగిపోతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి రోజూ తాగితే వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. రోజూ ఉదయాన్నే అల్లం ముక్కతో చేసిన కషాయాన్ని తాగితే కొద్ది రోజుల్లోనే పొట్టలోని కొవ్వు మాయమవుతుంది. రాత్రిపూట ఒక చెంచా మెంతులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే, మీరు ఆరోగ్యకరమైన బరువు తగ్గడంతో పాటు పొట్టను కరిగించుకోవచ్చు. అలాగే, రోజూ పుదీనా నీటిని తాగడం వల్ల అజీర్తి సమస్యలు దూరమై జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాదు పొట్ట కూడా కొద్దిరోజుల్లో ఫ్లాట్ అయిపోతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us