Study on Aliens: అప్పటికల్లా ఏలియన్స్‌తో మానవులకు సంబంధాలు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

Study on Aliens: మానవులు రెండు దశాబ్దాల కంటే తక్కువ సమయంలోనే అంగారక గ్రహంపై కాలు మోపుతారని.. ఇంకో శతాబ్దం ముగిసేలోపు..

Study on Aliens: అప్పటికల్లా ఏలియన్స్‌తో మానవులకు సంబంధాలు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 27, 2021 | 2:51 PM

Study on Aliens: మానవులు రెండు దశాబ్దాల కంటే తక్కువ సమయంలోనే అంగారక గ్రహంపై కాలు మోపుతారని.. ఇంకో శతాబ్దం ముగిసేలోపు ఒక గ్రహం నుంచి మరో గ్రహం మీదకు అడుగుపెడతారని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో ఉన్న గ్రహాల కదలికలు, వాటిలో జీవ రాశుల మనుగడపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్‌లోని పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. వాటికి సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు ప్రిప్రింట్ పేపర్‌లో పంచుకున్నారు. 20 సంవత్సరాల కంటే తక్కువ సమయంలో మానవులు అంగారక గ్రహంపై నడుస్తారని వెల్లడించారు. దీంతోపాటు శతాబ్దం ముగిసేలోపు వారు బృహస్పతి లేదా శని ఉపగ్రహాలపై కూడా అడుగు పెట్టవచ్చని వెల్లడించారు.

అంతరిక్ష పరిశోధనా కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. బహుశా 350 సంవత్సరాలలో, అలాగే దాదాపు 2383 సంవత్సరాలలో మానవులు మన సౌర వ్యవస్థ వెలుపలి నుంచి ఏలియన్స్ జాతులతో సంబంధంలోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వెల్లడైన అధ్యయనం కీలక వాస్తవాలను వివరించింది. దీనిని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని ఎర్త్ సైన్సెస్ విభాగంలో శాస్త్రవేత్త, గ్రూప్ లీడర్ అయిన జోనాథన్ హెచ్. జియాంగ్, అతని బృందం నిర్వహించింది.

మానవులు 2038లో అంగారక గ్రహంపై అడుగుపెట్టవచ్చని, 2086 నాటికి శని గ్రహంపై కూడా మనం వెళ్లవచ్చని వారి సమీకరణాలు సూచిస్తున్నాయి. 2254 నాటికి మానవులు సౌర వ్యవస్థను దాటి.. సమీప గ్రహ వ్యవస్థలోకి ప్రవేశించడం జరుగుతుందంటూ వెల్లడించారు. ఏదో ఒకరోజు మానవులు ఏలియన్స్‌ను కలిసే అవకాశం వస్తుందంటూ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇది 2383 సంవత్సరం నాటికి సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది తక్కువ సమయంలోనే సాధ్యమవుతుందని.. సౌర వ్యవస్థ నుంచి 14,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

కాలుష్యం, వాతావరణ కల్లోలాలు భూమిపైనున్న జీవరాశులను భయాందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో.. మరొక గ్రహానికి తప్పించుకోవడంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ ద్వారానే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Bluefin Tuna Fish: మళ్ళీ కనిపించిన ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్..

Cherry Tomatoes: ఒక్క కాండానికి ఏకంగా 839 చెర్రీ టమాటాలు.. గిన్నిస్ బుక్‌లో చోటు .. ఎక్కడంటే..