AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Microwave Oven: మైక్రోవేవ్‌ ఓవెన్స్‌తో ఏ క్షణమైన వేడివేడి ఆహారం సిద్ధం.. ది బెస్ట్‌ ఓవెన్స్‌ ఇవే..!

ఆహారం ఎప్పిటికప్పుడు వేడివేడిగా రుచికరంగా తినడానికి ఇటీవల కాలంలో మైక్రోవేవ్‌ ఓవెన్‌లు ఎక్కువగా వాడుతున్నారు. గతంలో కేవలం ఉన్నత శ్రేణి వర్గాలు మాత్రమే వాడే మైక్రోవేవ్‌ ఓవెన్‌లు ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు కూడా అధికంగా వాడుతున్నారు. అయితే మైక్రోవేవ్‌ ఓవెన్‌లు వాడే సమయంలో వాటిల్లో వచ్చే ఫీచర్లు తెలుసుకోవాలి. ప్రస్తుతం యూట్యూబ్‌ అందుబాటులో ఉండడంతో ఈ ఫీచర్ల గురించి సులభంగా తెలుసుకునే అవకాశం ఉండడంతో అధికంగా మైక్రోవేవ్‌ ఓవెన్‌లను కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన అనూహ్య డిమాండ్‌ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ మార్కెట్లోకి రిలీజ్‌ చేస్తున్నాయి.

Best Microwave Oven: మైక్రోవేవ్‌ ఓవెన్స్‌తో ఏ క్షణమైన వేడివేడి ఆహారం సిద్ధం.. ది బెస్ట్‌ ఓవెన్స్‌ ఇవే..!
Microwave Oven
Nikhil
|

Updated on: Feb 04, 2024 | 7:15 PM

Share

ప్రస్తుత రోజుల్లో పెరిగిన అవసరాలతో చాలా సౌకర్యాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మనం ఎప్పుడూ వాడే వంటగదిలో ఇలాంటి మార్పులను గమనించవచ్చు. గ్యాస్‌ స్టవ్‌, మిక్సీ, గ్రైండర్లు వంటి ఈ మార్పుల్లో ప్రధాన భాగంగా అనుకోవచ్చు. అయితే ఆహారం ఎప్పిటికప్పుడు వేడివేడిగా రుచికరంగా తినడానికి ఇటీవల కాలంలో మైక్రోవేవ్‌ ఓవెన్‌లు ఎక్కువగా వాడుతున్నారు. గతంలో కేవలం ఉన్నత శ్రేణి వర్గాలు మాత్రమే వాడే మైక్రోవేవ్‌ ఓవెన్‌లు ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలు కూడా అధికంగా వాడుతున్నారు. అయితే మైక్రోవేవ్‌ ఓవెన్‌లు వాడే సమయంలో వాటిల్లో వచ్చే ఫీచర్లు తెలుసుకోవాలి. ప్రస్తుతం యూట్యూబ్‌ అందుబాటులో ఉండడంతో ఈ ఫీచర్ల గురించి సులభంగా తెలుసుకునే అవకాశం ఉండడంతో అధికంగా మైక్రోవేవ్‌ ఓవెన్‌లను కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన అనూహ్య డిమాండ్‌ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ఫీచర్లతో మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ మార్కెట్లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటలో ఉన్న మైక్రోవేవ్‌ ఓవెన్స్‌ ది బెస్ట్‌ ఓవెన్స్‌పై ఓ లుక్కేద్దాం.

బజాజ్ 17 ఎల్‌ సోలో మైక్రోవేవ్ ఓవెన్

బజాజ్ 17 ఎల్‌ సోలో మైక్రోవేవ్ ఓవెన్‌ ఇటీవల కాలంలో అధిక ప్రజాదరణ పొందింది. ఈ సోలో మైక్రోవేవ్‌లో రీహీటింగ్, డీఫ్రాస్టింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. 17 లీటర్ల కెపాసిటీతో వచ్చే ఈ ఓవెన్‌ చిన్న కుటుంబాలతో పాటు బ్యాచిలర్స్‌ వాడడానికి కూడా అనువుగా ఉంటుంది. బహుళ సెట్టింగ్‌లతో ఈ ఓవెన్‌లో అధునాతన ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి.ఈ ఓవెన్ మైక్రోవేవ్ సంవత్సరానికి 1200 వాట్లను వినియోగిస్తుంది. సొగసైన డిజైన్‌తో వచ్చే ఈ ఓవెన్‌పై ఓ సంవత్సరం వారెంటీ ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌లో బజాజ్ మైక్రోవేవ్ ఓవెన్ ధర: రూ. 4,990.

ఐఎఫ్‌బీ 25 ఎల్‌ సోలో మైక్రోవేవ్‌ ఓవెన్‌ 

వాషింగ్‌ మెషీన్‌ విభాగంలో అత్యంత ఆదరణ పొందిన ఐఎఫ్‌బీ ప్రస్తుతం మైక్రోవేవ్‌ ఓవెన్‌లు కూడా అందుబాటులో ఉంటుంది. ఐఎఫ్బీ 25 ఎల్‌ సోలో మైక్రోవేవ్ ఓవెన్ మీ వంట సమయాన్ని గణీనీయంగా తగ్గస్తుంది. సిల్వర్ షేడ్ ఫ్రీస్టాండింగ్ మైక్రోవేవ్ ఓవెన్ 61 ఆటో-కుక్ మెనూ ఎంపికలతో వస్తుంది. ఆహారం బరువును నమోదు చేసేటప్పుడు మీరు సులభంగా డీఫ్రాస్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఐఎఫ్‌బీ ఓవెన్ పిల్లల భద్రతను నిర్ధారిస్తుంది ఈ మైక్రోవేవ్ ఓవెన్ ధర: రూ. 8,950గా ఉంది. 

ఇవి కూడా చదవండి

గోద్రేజ్‌ 23 ఎల్‌ హీట్‌ ట్రాన్స్‌మిషన్‌  మైక్రోవేవ్ ఓవెన్

సరికంత్త సాంకేతికతతో అందుబాటులో ఉండే గోద్రెజ్ 23 ఎల్‌ మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా హెల్తీ ఆయిల్-ఫ్రీ రెసిపీ ఫీచర్‌తో రుచిగల ఆహారాన్ని వండుకోవచ్చు. చికెన్ తందూరీ, కార్న్ కబాబ్‌లు లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి మీకు ఇష్టమైన రుచికరమైన వంటకాలను తక్కువ నూనెతో వండుకోవచ్చు. ఈ గోద్రెజ్ మైక్రోవేవ్ ఓవెన్ 800 వాట్స్‌ పవర్‌ని అందజేస్తుంది. నలుగురు ఉండే కుటుంబాలకు ఈ ఓవెన్‌ సరిగ్గా సరిపోతుంది. స్టీమ్ క్లీనింగ్, స్టెయిన్‌లెస్ స్టీల్ క్యావిటీ, డీఫ్రాస్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లతో వచ్చే మైక్రోవేవ్ ఓవెన్ ధర: రూ. 9,990.

పానాసోనిక్‌ 27 ఎల్‌ కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌ ఓవెన్‌

పానాసోనిక్ 27 ఎల్‌ మైక్రోవేవ్ ఓవెన్ చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మైక్రోవేవ్ ఓవెన్ 900 వాట్ల శక్తితో పని చేస్తుంది. బ్లాక్ మిర్రర్ షేడ్ వల్ల మీ వంటగదిలో ఈ ఓవెన్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. కాంపాక్ట్ కౌంటర్‌టాప్‌ల కోసం సరైన మైక్రోవేవ్ ఓవెన్‌గా ఇది ఉంటుంది. క్లాస్సి, కాంటెంపరరీ లుక్‌లతో వచ్చే పానాసోనిక్ మైక్రోవేవ్ ఓవెన్ ధర: రూ. 11,490.

సామ్‌సంగ్‌ 28 ఎల్‌ కన్వెక్షన్‌ మైక్రోవేవ్‌  ఓవెన్‌

పెద్ద కుటుంబాలకు అనువైన 28 ఎల్‌ సామర్థ్యంతో సామ్‌సంగ్‌మైక్రోవేవ్ ఓవెన్ బేకింగ్, గ్రిల్లింగ్, రీహీటింగ్, డీఫ్రాస్టింగ్ వంటి ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. సామ్‌సంగ్‌ స్మార్ట్ సెన్సార్ టెక్నాలజీ ఆహారం చుట్టూ తేమ స్థాయిని స్వయంచాలకంగా గుర్తిస్తుంది. సరైన వంట సమయం మరియు శక్తిని సెట్ చేస్తుంది. ముందుగానే సెట్ చేసిన 15 రకాల మెనుల నుండి ఆరోగ్యకరమైన వంటను ఆశ్వాదించవచ్చు. ఈ సామ్‌సంగ్‌ మైక్రోవేవ్ ఓవెన్ ధర: రూ.17,290గా ఉంది. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..