Solar Eclipse 2024: ఈ ఏడాది ఫస్ట్ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది.. భారత్‌లో కనిపిస్తుందా తెలుసుకోండి..
హిందూ జ్యోతిషశాస్త్రంలో సూతకం అనేది సూర్యగ్రహణానికి 12 గంటల ముందు మొదలయ్యే అశుభ సమయం. ఈ సమయంలో, అన్ని శుభకార్యాలు నిలిపివేయబడతాయి. సూర్యగ్రహణం ముగిసిన అనంతరం సూతకం ముగుస్తుంది. ఈ ఖగోళ దృగ్విషయానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది భారతదేశంలో కనిపించదు. కనుక ఇక్కడ సూత కాలం ఉండదు.

గ్రహణానికి హిందూ సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సైన్స్ ప్రకారం సూర్యగ్రహణం అనేది భూమి, సూర్యుని మధ్య చంద్రుడు నేరుగా వెళుతున్నప్పుడు సూర్యుని కాంతి భూమి పడదు. ఈ చర్యను సూర్యగ్రహణం అని అంటారు. ఈ ఏడాది 2024 లో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 8 వతేదీ సోమవారం అమావాస్య తిధిలో ఏర్పడనుంది. అంటే అమావాస్య రోజున ఏర్పాడే ఈ సూర్య గ్రహణం భారత కాల మనం ప్రకారం రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై ఉదయం 01:25 గంటలకు ముగుస్తుంది.
హిందూ జ్యోతిషశాస్త్రంలో సూతకం అనేది సూర్యగ్రహణానికి 12 గంటల ముందు మొదలయ్యే అశుభ సమయం. ఈ సమయంలో, అన్ని శుభకార్యాలు నిలిపివేయబడతాయి. సూర్యగ్రహణం ముగిసిన అనంతరం సూతకం ముగుస్తుంది. ఈ ఖగోళ దృగ్విషయానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది భారతదేశంలో కనిపించదు. కనుక ఇక్కడ సూత కాలం ఉండదు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిర్దిష్ట ప్రాంతంలో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం కనిపించినప్పుడు.. సూతక కాలం కూడా గమనించబడుతుంది అని చెప్పారు.
ఏయే ప్రాంతాల్లో కనిపిస్తుందంటే ..
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం అమెరికాలోని 13 రాష్ట్రాల్లో పూర్తిగా కనిపించనుంది. ఈ ప్రాంతాలతో పాటు, కెనడా , మెక్సికోలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం నైరుతి యూరప్, ఆస్ట్రేలియా, పశ్చిమాసియా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలో కనిపిస్తుంది. ఇది పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఇంగ్లాండ్ , ఐర్లాండ్‌లోని వాయువ్య ప్రాంతంలో కూడా కనిపిస్తుంది.
మన దేశంలో కనిపించక పోయినా…
సూర్యగ్రహణం సంభవించిన సమయంలో మీకు నచ్చిన దైవనాన్ని స్మరించుకుని ధ్యానం చేయాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెబ్‌సైట్ ప్రకారం మనస్సుకు చంద్రునితో, శరీరానికి భూమితో ఉన్న అనుబంధం దీనికి కారణం. దేవత పేరును జపించవచ్చు లేదా మంత్రాలనైనా జపించవచ్చు. సూర్యగ్రహణం ముగిసిన అనంతరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి. అంతేకాదు వీలయితే గోధుమలు, బెల్లం దానం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు