Valentines Special: ప్రేమికుల రోజున ఈ వాస్తు చిట్కాలను పాటించి చూడండి.. మీ బంధం మరింత అందంగా మారుతుంది..
ప్రేమను వ్యక్తం చేయడానికి నిర్ణీత సమయం, రోజు అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఎప్పుడూ చెక్కుచెదరకుండా ఉండాలి. జీవితంలో ప్రేమను శాశ్వతంగా నిలుపుకోవడానికి కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకుందాం.. ప్రతి ఒక్కరూ తమ సంబంధాలను బలోపేతం చేయడానికి వాలెంటైన్స్ డే రోజున వీటిని పాటించవచ్చు
వాలెంటైన్స్ డే అనేది సంవత్సరం మొత్తంలో ప్రేమకు ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చే రోజు. ఈ రోజున చాలా మంది యువతీ యువకులు తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. అంతేకాదు తమ భాగస్వామితో జీవితాంతం కలిసి జీవిస్తానని ప్రమాణం చేస్తారు. అయితే ప్రేమను వ్యక్తం చేయడానికి నిర్ణీత సమయం, రోజు అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఎప్పుడూ చెక్కుచెదరకుండా ఉండాలి. జీవితంలో ప్రేమను శాశ్వతంగా నిలుపుకోవడానికి కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకుందాం.. ప్రతి ఒక్కరూ తమ సంబంధాలను బలోపేతం చేయడానికి వాలెంటైన్స్ డే రోజున వీటిని పాటించవచ్చు.
ఈ దిశలో అద్దం ఉంచండి
జీవితంలోని ప్రతి రకమైన పరిస్థితి అద్దంలో ప్రతిబింబిస్తుంది. అందువల్ల వాస్తు ప్రకారం గదిలో ఎప్పుడూ పెద్ద అద్దం ఏర్పాటు చేయకూడదని నమ్ముతారు. ముఖ్యంగా అద్దం సరిగ్గా బెడ్ ముందు పెట్టుకోకూడదు. . ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి, బంధం మధ్య వివాదాలు మొదలవుతాయి.
పడకగదిని ఇలా అలంకరించుకోండి
పడకగదిని ఆకర్షణీయంగా, సానుకూల శక్తితో నింపడానికి, సువాసనగల కొవ్వొత్తులు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఇలా చేయడం వలన సంబంధాలలో సమతుల్యతను కాపాడుతుంది. శ్రావ్యమైన, శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికి మాస్టర్ బెడ్‌రూమ్ గోడలకు గులాబీ రంగు వేయండి లేదా అదే రంగు కర్టెన్‌లను ఉపయోగించండి.
నిద్ర దిశ ప్రభావం చూపుతుంది
వాస్తవానికి తమకు నచ్చిన దిశలో నిద్రించడం ద్వారా మాత్రమే మంచి నిద్రను పోతారు. అయితే వాస్తు ప్రకారం చూస్తే బంధం బలంగా ఉండాలన్నా.. సుఖ సంతోషాలతో జీవితం గడచిపోవాలన్నా.. భర్త ఎల్లప్పుడూ భార్యకు కుడి వైపున నిద్రించాలి. వాస్తు ప్రకారం మెటల్ బెడ్‌ని ఉపయోగించవద్దు. అంతేకాదు సింగిల్ పరుపుని మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి.
ఈ దిశలో మంచం ఉంచండి
వివాహ జీవితంలో సామరస్యాన్ని సృష్టించడానికి పడకగదిలో సరైన దిశలో మంచం ఉంచండి. భార్యాభర్తలు తమ పడకగదిలో ఎప్పుడూ నైరుతి దిశలో మంచాన్ని ఉంచాలి. బెడ్‌రూమ్‌లోని బెడ్ ఎప్పుడూ మెయిన్ డోర్‌కి దూరంగా ఉండాలి. నిద్రించేటప్పుడు తల దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి దిశలో ఉండాలి. పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు