Vastu Tips: ఇంట్లో ఈ సమస్యలా.? వాస్తు దోషం ఉన్నట్లే..
ఇంట్లో ఉండే వస్తువులు, ఏ దిశలో ఏ వస్తువులు ఉండాలన్న విషయాలను సైతం స్పష్టంగా తెలియజేశారు. ఇక ఇంట్లో వాస్తు పరంగా ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే కొన్ని రకాల చెడు సంకేతాలు కనిపిస్తాయి. ఇంతకీ...

వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించిన ఎన్నో అంశాలను ప్రస్తావించారు. వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఉండే వస్తువులు, ఏ దిశలో ఏ వస్తువులు ఉండాలన్న విషయాలను సైతం స్పష్టంగా తెలియజేశారు. ఇక ఇంట్లో వాస్తు పరంగా ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే కొన్ని రకాల చెడు సంకేతాలు కనిపిస్తాయి. ఇంతకీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే కనిపించే ఆ లక్షణాలు ఏంటి.? ఎలాంటి దోషాల వల్ల ఇవి కనిపిస్తాయి..? ఇప్పుడు తెలుసుకుందాం..
* కొన్ని ఇళ్లలో కుటుంబ సభ్యులు చిన్న చిన్న విషయాలకే హైరానా పడిపోతుంటారు. ఏదో చెడు జరుగుతోందన్న భావన మనసును నిత్యం వేధిస్తూనే ఉంటుంది. అలాగే ఒకరిపై, మరొకరు నిత్యం ఫిర్యాదు చేసుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఆ ఇంట్లో కచ్చితంగా వాస్తు దోషం ఉందని గుర్తించాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
* ఇక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే, వారి మధ్య సక్యత లేకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అర్థం. ప్రశాంతత కరువై ఇంట్లో నిత్యం గొడవలు ఉంటే వెంటనే వాస్తును చూపించుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
* ఇక ఏ పనిచేపట్టినా వైఫల్యాలు ఎదురుకావడం, విజయాలు అందుకోలేకపోవడం. వ్యాపారంలో నష్టాలు, ఆరోగ్యాలు ఎప్పుడు బాగుండకపోవడం కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
* ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు నిత్యం అయోమయానికి గురికావడం. ఏదో తెలియని ఆందోళన వెంటాడడం లాంటి పరిస్థితులు ఉంటే ఆ ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
ఇవీ కొన్ని కారణాలు..
* ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి ఇంటి పరిశుభ్రత కూడా ఒక కారణమని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో చెత్తాచెదారం ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు.
* ఇంట్లో నిత్యం మురికి దుస్తులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం మురికి దుస్తులను ధరించడం వల్ల ఆర్థికంగా దెబ్బతింటారని చెబుతున్నారు. అందుకే ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండే దుస్తులు ధరించాలని చెబుతున్నారు.
* ఇక పూజ గదిలో ఏర్పాటు చేసుకునే దేవుని విగ్రహాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాలు, పటాలను ఎదురెదురుగా ఉంచుకోకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స గమినించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
