AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET Success Story: నేటి తరానికి స్పూర్తి కృతి.. బస్టాప్‌లు, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లో చదివి నీట్ ని క్లియర్ చేసిన యువతి..

కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పిన మాటలను కొంతమంది అనుసరిస్తారు. తమకంటూ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని అందుకోవడం కోసం కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తారు. తమ లక్ష్యాన్ని అందుకుంటారు. అందుకు ఉదాహరణగా నిలిచే నేటి యువతకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నీట్ పరీక్షలో విజయం సాధించడానికి ఓ యువతి పడిన కష్టం గురించి తెలుసుకుందాం..

NEET Success Story: నేటి తరానికి స్పూర్తి కృతి.. బస్టాప్‌లు, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లో చదివి నీట్ ని క్లియర్ చేసిన యువతి..
Neet Exam
Surya Kala
|

Updated on: Dec 28, 2024 | 10:26 AM

Share

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. నీట్ లో మంచి ర్యాంక్ సాధింఛి డాక్టర్ అవ్వడం కోసం ఎంతో కష్టపడతారు. తల్లిదండులు కూడా తమ పిల్లలు పరీక్షకు ప్రిపేట్ అయ్యే సమయంలో అనేక సదుపాయాలు కల్పిస్తారు. ఈ రోజు 2013లో జరిగిన నీట పరీక్షలో.. ర్యాంక్‌ సాధించిన స్టూడెంట్ ప్రయాణం నేటి తరానికి స్పూర్తిదాయకం తన మూడవ ప్రయత్నంలో నీట్-యుజిని ఛేదించిన కృతి అగర్వాల్ ప్రయాణం గురించి తెల్సుకుందాం..

2013లో కృతి అగర్వాల్ నీట్ ర్యాంకర్లలో ఒకరు. తన కృషి, పట్టుదలతో నీట్ క్రాక్ చేసిన ర్యాంకర్ జాబితాలో నిలిచింది. 2012లో కృతి ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ (AIPMT)కి హాజరైంది. ఆమె పరీక్షలో అర్హత సాధించింది. అయితే చివరి రౌండ్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. 2013లో కృతి నీట్-యుజి పరీక్షకు హాజరైనప్పటికీ దానిని క్లియర్ చేయడంలో విఫలమైంది. దీంతో డ్రాప్ తీసుకుని మళ్లీ పరీక్షకు సిద్ధమైంది. ఫెయిల్యూర్స్‌తో అధైర్యపడకుండా.. కృతి తన స్టడీ స్ట్రాటజీలలో చాలా మార్పులు తీచేసుకుంది. తన సెల్ ఫోన్ లోని వాట్సాప్ , ఫేస్‌బుక్‌కి గుడ్ బై చెప్పేసింది. అన్‌ఇన్‌స్టాల్ చేసింది.. వాటి మీద నుంచి తన దృష్టిని పూర్తిగా మరలించుకుంది.

కృతి తన స్నేహితులతో గడిపే సమయానికి కూడా స్వస్తి చెప్పేసింది. కృతి ఏకైక దృష్టి NEET-UG పరీక్షపైనే కేంద్రీకరించింది. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి చదవడం మొదలు పెట్టింది. కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లే సమయంలో కూడా సమయాన్ని వృధా చేసుకోలేదు. బస్టాప్‌లు లేదా రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో ఇలా ఎక్కడ సమయం దొరికితే అక్కడ చదువుకునేది. కృతి నీట్ ని క్రాక్ చేయడనికి కష్టపడుతుంటే.. అందుకు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన సహకారాన్ని ప్రశంసించాల్సిందే. కృతి తల్లిదండ్రులు అడుగడుగునా మద్దతుగా నిలిచారు. కృతి చదువుపై ఏకాగ్రత పెట్టేందుకు వీలుగా తల్లిదండ్రులు తమ గదిని కూతురికి ఇచ్చారు. ఇలా ఎంతో కష్టపడి కృతి నీట్ కు రెడీ అయ్యింది. 2013లో NEET-UG పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఆమె తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. కృతి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. వైఫల్యం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి కృషి, పట్టుదలతో ప్రయత్నించాలని నేర్పుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..