AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: అయ్యో దేవుడా..! మహిళ ఎడమ కాలుకు ఫ్రాక్చర్ .. కుడి కాలుకు ఆపరేషన్ చేసిన వైద్యులు..

కుడి ఎడమ అయితే పొరపాటు లేదు అన్న సినీ కవి చెప్పిన విషయాన్ని డాక్టర్ బాగా గుర్తు పెట్టుకున్నాట్లున్నాడు. దీంతో ఒక కాలులికి దెబ్బ తగిలితే మరొక కాలికి చికిత్స చేశారు. ఈ ఘటన సుల్తాన్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో విరిగిన కాలుకు బదులుగా మరొక కాలుకు ఆపరేషన్ చేసిన ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధ మహిళకు విరిగిన కాలుకి ఆర్థోపెడిక్ నిపుణుడు ఆపరేషన్ చేశాడు. అయితే ఆపరేషన్ తర్వాత ఆ మహిళ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇప్పుడు రెండవ ఆపరేషన్ జరిగింది. ఈ విషయంపై ఆస్పత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.

Uttar Pradesh: అయ్యో దేవుడా..! మహిళ ఎడమ కాలుకు ఫ్రాక్చర్ .. కుడి కాలుకు ఆపరేషన్ చేసిన వైద్యులు..
Uttar Pradesh News
Surya Kala
|

Updated on: Dec 28, 2024 | 9:09 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఆర్థోపెడిక్ సర్జన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన వెలుగు చూసింది. వృద్ధురాలి విరిగిన కాలికి ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్‌ చేసి మహిళను బయటకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే అతను విరిగిన కాలికి బదులుగా మరో కాలికి వైద్యుడు ఆపరేషన్ చేయడంతో అది చూసి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.

ప్రతాప్‌గఢ్ జిల్లా కన్హై పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. సిక్రి కనుపూర్ గ్రామానికి చెందిన భూలా దేవి ఎడమ కాలికి గాయం కావడంతో ఆమె నడవలేని స్థితికి చేరుకుంది. ఎడమ కాలుకి ఫ్రాక్చర్ అయినట్లు ఎక్స్-రేలో తేలింది. దీంతో డాక్టర్ ఆపరేషన్ చేయాలనీ సూచించారు.

ఆపరేషన్లో లోపం

ఆపరేషన్‌ చేసి భూలాదేవిని ఆపరేషన్ రూమ్ నుంచి బయటకు తీసుకురాగా.. ఎడమ కాలికి ఆపరేషన్‌ చేయ కుండా.. కుడి కాలికి ఆపరేషన్‌ చేసినట్లు కుటుంబీకులు చూశారు. ఇది చూసిన కుటుంబ సభ్యులలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే ఆసుపత్రి నిర్వాహకులను ప్రశ్నించారు. దీని తర్వాత భూలాదేవిని మళ్లీ ఆపరేషన్ గదికి తీసుకెళ్లారు. తర్వాత ఆమె ఎడమ కాలికి ఆపరేషన్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రిలో గందరగోళం

ఘటన అనంతరం ఈ వార్త దావానంలా వ్యాపించడంతో ఆస్పత్రిలో కలకలం రేగింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ పీకే పాండే అక్కడి నుంచి వెంటనే పరారీ అయ్యారు. ఈ విషయంపై ఆస్పత్రి సిబ్బంది క్లారిఫికేషన్ ఇస్తూ.. ఎడమ కాలు బంతి విరిగిందని.. అందుకోసం ఆపరేషన్ చేశామని చెప్పారు. అయితే కుడి కాలులో వాపు, రక్తం పేరుకుపోయిందని ఆపరేషన్ చేసి వాటిని తొలగించామని చెప్పారు. ఆసుపత్రి పాలకవర్గం చెప్పిన ఈ వివరణ కుటుంబ సభ్యులను, ప్రజలను సంతృప్తి పరచలేకపోయింది.

విచారించనున్న అధికారులు

ఈ ఘటనపై కేసు నమోదు అయింది. తర్వాత ఆసుపత్రి పరిపాలన సిబ్బంది, వైద్యుడిపై విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై న్యాయంగా దర్యాప్తు చేయాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు. విషయం తీవ్రతను అర్థం చేసుకున్న సుల్తాన్‌పూర్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆరోగ్యశాఖ దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.

వృద్ధురాలి చికిత్సలో తీవ్ర తప్పిదం జరగడమే కాదు.. ఆసుపత్రి నిర్లక్ష్యాన్ని ఈ ఘటన బట్టబయలు చేస్తోంది. ఆస్పత్రి, వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం ఈ వృద్ధ మహిళ పరిస్థితి మరింత దిగజారింది. ఈ విషయంలో పాలనా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడవచ్చునని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..