AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Somvati Amavasya: మార్గశిర సోమ అమావాస్య తేదీలో గందరగోళం.. డిసెంబర్ 30నా? 31నా తెలుసుకోండి..

ప్రతి సంవత్సరం మార్గశిర అమావాస్య ను మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిధిన జరుపుకుంటారు. ఈ అమావాస్య ఆంగ్ల సంవత్సరంలో చివరి అమావాస్య. ఈసారి మార్గశిర అమావాస్య తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. అటువంటి పరిస్థితిలో 2024 సంవత్సరంలో మార్గశిర అమావాస్య ఎప్పుడో తెలుసుకుందాం.

Somvati Amavasya: మార్గశిర సోమ అమావాస్య తేదీలో గందరగోళం.. డిసెంబర్ 30నా? 31నా తెలుసుకోండి..
Somvati Amavasya 2024
Surya Kala
|

Updated on: Dec 28, 2024 | 8:42 AM

Share

హిందూ మతంలో అమావాస్య తిథికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి రోజున స్నానం చేయడం, దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి రోజున పూర్వీకులకు తర్పణం విడవడం, పిండ ప్రదానం చేయడం ద్వారా వ్యక్తి విశేష ఫలితాలను పొందుతాడు. వేద క్యాలెండర్ ప్రకారం మార్గశిర అమావాస్య రోజున శివుడు , విష్ణువులను పూజించడంతో పాటు స్నానం చేయడం, దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంటిలో సుఖ, శాంతి, ఐశ్వర్యం మొదలైనవి లభిస్తాయని నమ్మకం. అంతేకాదు ఎవరైనా తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం.

ఈ అమావాస్య ఆంగ్ల సంవత్సరంలో చివరి అమావాస్య కూడా అవుతుంది. ఈసారి మార్గశిర అమావాస్య సోమవారం వస్తుంది. కనుక ఈ రోజున సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తారు. అయితే మార్గశిర అమావాస్య తిథి విషయంలో గందరగోళం నెలకొంది. ఈ అమావాస్య డిసెంబర్ 30న జరుపుకోవాలని కొందరు, 31న అమావాస్య జరుపుకోవాలని మరికొందరు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో 2024 సంవత్సరంలో మార్గశిర అమవాస్య తిధి అంటే సోమవతి అమావాస్య రోజున స్నానం, దానానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకుందాం.

2024లో మర్గశిర అమావాస్య ఎప్పుడంటే

వైదిక క్యాలెండర్ ప్రకారం ఈసారి మార్గశిర మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి డిసెంబర్ 30 తెల్లవారుజామున 4.01 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ అమావాస్య తిథి మర్నాడు రోజు డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామున 3.56 గంటలకు ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం మార్గశిర అమావాస్య 30 డిసెంబర్ 2024 న జరుపుకుంటారు. ఈ సంవత్సరం చివరి అమావాస్య చాలా పవిత్రమైనది. ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజు సోమవారం కనుక. ఈ అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున శుభకార్యాలు చేయడం వల్ల సంపద పెరుగుతుంది.

సోమవతి అమావాస్య శుభ సమయం ఎప్పుడంటే

  1. బ్రహ్మ ముహూర్తం – డిసెంబర్ 30 ఉదయం 5:16 నుంచి 6:11 వరకు ఉంటుంది.
  2. స్నాన దాన ముహూర్తం – డిసెంబర్ 30 ఉదయం 05:24 నుంచి 06:19 వరకు.
  3. విజయ ముహూర్తం – డిసెంబర్ 30 మధ్యాహ్నం 01:57 నుంచి 02:38 వరకు.
  4. అశుభ సమయం – డిసెంబర్ 30 రాత్రి 08:23 నుంచి 09:40 వరకు.
  5. సోమవతి అమావాస్య రోజు ఏం చేయాలంటే
  6. సోమవతి అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి.
  7. అనంతరం శుభ్రమైన బట్టలు ధరించి మీ పూర్వీకులను స్మరించుకోండి. వారికి తర్పణం సమర్పించండి.
  8. దీని తరువాత నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులు, దర్భ గడ్డితో పూర్వీకులకు అర్ఘ్యం సమర్పించండి.
  9. పూర్వీకుల ఆశీర్వాదం కోసం, దక్షిణ దిశలో దీపం వెలిగించండి.
  10. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని పితృ దోషం తొలగిపోతుందని నమ్మకం.
  11. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టును పూజించండి.
  12. తర్వాత రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు అనంతరం నీరు సమర్పించాలి.
  13. దీని తరువాత ఆవనూనెలో నల్ల నువ్వులను వేసి, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి.
  14. సోమవతి అమావాస్య రోజున పూర్వీకుల అనుగ్రహం కోసం పితృ చాలీసా పఠించండి.
  15. మార్గశిర అమావాస్య రోజున పేదలకు, ఆపన్నులకు, బ్రాహ్మణులకు ఆహారం అందించండి.
  16. సోమవతి అమావాస్య రోజున పెరుగు-పాలు, వస్త్రాలు, ఆహారం, నల్ల నువ్వులను దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.