Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఏడవలేదు.. ఆ తల్లి ఆవేదన అంతా, ఇంతా కాదు..

బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకపోతే తల్లిదండ్రులే కాదు డాక్టర్లు సైతం కంగారుపడతారు. తాజాగా అలాంటి అరుదైన కేసు కెనడాలో వెలుగుచూసింది.

Viral News: పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఏడవలేదు.. ఆ తల్లి ఆవేదన అంతా, ఇంతా కాదు..
Baby Can't Cry
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 20, 2021 | 1:23 PM

బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. అప్పుడు తల్లి ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే బిడ్డ ఏడుస్తుంటే.. అమ్మ ఆనందంతో ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఏడవకపోతే తల్లిదండ్రులే కాదు డాక్టర్లు సైతం కంగారుపడతారు. తాజాగా అలాంటి అరుదైన కేసు కెనడాలో వెలుగుచూసింది. ఒక మహిళ తన ఆరు నెలల బిడ్డ ఏడుపు ఇంతవరకు వినలేదు. ఈ అరుదైన వ్యాధిపై అధ్యయనం చేస్తోన్న వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఆ పిల్లవాడి చికిత్స గురించి తల్లి చాలా ఆందోళన చెందుతుంది. కెనడాలో నివసిస్తున్న లుసిండా ఆండ్రూస్ బిడ్డకు ఉన్న సమస్య ఏమిటంటే ఏడవలేకపోవడం. కుమారుడు పుట్టినప్పటి నుంచి ఏడవడం కాదు కదా కనీనం కేకలు వేయడం కూడా ఆమె వినలేదు. చాలా ముద్దుగా ఉండే బిడ్డ  ఏడవకపోవడం తల్లికి ఆందోళన కలిగిస్తుంది.  తన బిడ్డను వింత వ్యాధి బారి నుంచి కాపాడటానికి, ఈ దిశగా కొంత పరిశోధన చేయాలని ఆమె వైద్యులను అభ్యర్థిస్తోంది.

32 ఏళ్ల లూసిండా మార్చి 5 న ఒక కుమారుడికి జన్మనిచ్చింది. గర్భధారణ సమయంలో ఆమెకు ఎలాంటి సమస్యలు లేవు. అయితే కొడుకు పుట్టిన తరువాత అతని చేతులు, కాళ్ళు కదలడం లేదని వైద్యులు కనుగొన్నారు. ఇది కాకుండా, పిల్లవాడు తన తలని కూడా సరిగా కదిలించలేకపోయాడు. ఆ తర్వాత పలు వైద్య పరీక్షలు చేసిన అనంతరం, బిడ్డకు జన్యుపరమైన సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో శరీరంలో ప్రోటీన్ స్థాయి ప్రభావితమవుతుంది. లుసిండా తనయుడికి  శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంది. పలు అధ్యయనాల అనంతరం.. ఇది నవజాత శిశువులో TBCD జన్యువును ప్రభావితం చేసే చాలా అరుదైన వ్యాధి అని తేలింది. ఇలాంటి కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. దీనిపై పరిశోధనలు జరగలేదు. ఇప్పుడు లుసిండా శాస్త్రవేత్తలు ఈ దిశలో కొంత పరిశోధన చేయాలని కోరుకుంటున్నారు.  కాగా లుసిండా స్వయంగా ఈ అరుదైన వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

Also Read: ఐటీ దాడులు, పన్ను ఎగవేత ఆరోపణలపై స్పందించిన నటుడు సోను సూద్

కలెక్టర్‌‌ కావాలనుకున్న బాలిక.. వెంటాడిన ప్రాణాంతక వ్యాధి.. ఫైనల్‌గా నెలవేరిన కల