Viral News: కలెక్టర్‌‌ కావాలనుకున్న బాలిక.. వెంటాడిన ప్రాణాంతక వ్యాధి.. ఫైనల్‌గా నెలవేరిన కల

ఆ బాలిక కలెక్టర్‌ కావాలనుకుంది. కానీ.. ప్రాణాంతక వ్యాధి బారిన పడటంతో ఏం చేయలేని పరిస్థితి. చివరకు ఆ 11 ఏళ్ల ఫ్లోరా కల నెరవేరింది. ఒక్కరోజు అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొంది ఆ బాలిక.

Viral News: కలెక్టర్‌‌ కావాలనుకున్న బాలిక.. వెంటాడిన ప్రాణాంతక వ్యాధి.. ఫైనల్‌గా నెలవేరిన కల
One Day Collector
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 20, 2021 | 12:43 PM

గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా అసోడియా 7వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది ఫ్లోరా. గత నెలలో ఆ పాపకు ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో మెరుగవుతుందనుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. చిన్నారి కలను తెలుసుకున్నారు మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు. చొరవ తీసుకుని చిన్నారి గురించి అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్ సాంగ్లేకు వివరించారు. ఫ్లోరా అసోడియా కలను నేరవేర్చాలని కోరారు మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు. దీంతో చిన్నారిని ఒక్కరోజు కలెక్టర్‌ చేసేందుకు అంగీకరించారు పాలనాధికారి. ఫ్లోరా గురించి తెలిశాక, వారి తల్లిదండ్రులను సంప్రదించి, ఒకరోజు కలెక్టర్‌ విషయమై అంగీకారం కోరామని వివరించారు మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు. కానీ, శస్త్రచికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పి దానికి వారు విముఖత వ్యక్తం చేశారని చెప్పారు. చివరకు ఎలాగోలా వారిని ఒప్పించి ఆమె కలను సాకారం చేశాం అని వెల్లడించారు కలెక్టర్‌ సందీప్‌ సాంగ్లే.

అంతేకాకుండా చిన్నారి పుట్టినరోజు సెప్టెంబరు 25న వేడుకలను కూడా ముందుగానే జరిపారు. ఫ్లోరా చదువులో ముందుండేదని చెప్పారు ఆమె తల్లిదండ్రులు. కలెక్టర్‌ అవ్వాలనుకున్న తన కలను నెరవేర్చినందుకు సంతోషిస్తూ.. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఫ్లోరా అసోడియా పేరెంట్స్‌. ఫ్లోరా అసోడియా విషయంలో చొరవ చూపిన మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్, అహ్మదాబాద్ కలెక్టర్ సందీప్‌ సాంగ్లేను అభినందిస్తున్నారు స్థానికులు.

Also Read: ఐటీ దాడులు, పన్ను ఎగవేత ఆరోపణలపై స్పందించిన నటుడు సోను సూద్

Malli Modaliandi: సిద్ శ్రీరామ్ నోట ‘అలోన్‌ అలోన్’ అంటూ మరో మెలోడీ పాట.