Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రిసెప్షన్ రోజున బ్రేక్‌ డ్యాన్స్‌ చేసిన పెళ్లి కొడుకు..! పక్కనున్న ఫ్రెండ్స్ ఏం చేశారంటే..?

Viral Video: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద వేడుక. ఆ రోజును అందరికి గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని అందరు

Viral Video: రిసెప్షన్ రోజున బ్రేక్‌ డ్యాన్స్‌ చేసిన పెళ్లి కొడుకు..! పక్కనున్న ఫ్రెండ్స్ ఏం చేశారంటే..?
Groom Dance
Follow us
uppula Raju

|

Updated on: Sep 20, 2021 | 12:05 PM

Viral Video: వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద వేడుక. ఆ రోజును అందరికి గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని అందరు భావిస్తారు. అందుకోసం అన్ని ఏర్పాట్లను చేసుకుంటారు. బంధువులను, స్నేహితులను ఆహ్వానిస్తారు. వారికి విందు వినోదాలను కల్పిస్తారు. కొన్నిసార్లు వివాహ వేడుకలో జరిగిన సంఘటనలు వధూవరులిద్దరికి తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. తాజాగా ఓ వ్యక్తి అతడి వివాహం సందర్భంగా స్నేహితులు, బంధువులతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ విశేషాలేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో వరుడు, కొంతమంది స్నేహితులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేయడం మనం చూడవచ్చు. సూట్-బూట్ ధరించిన వరుడు అతిథుల మధ్యకు చేరుకొని డ్యాన్స్‌ చేయడం ప్రారంభిస్తాడు. మొదటగా ఒక్కడే చేస్తాడు. తర్వాత అతడి సంతోషాన్ని చూసి స్నేహితులు, బంధువులు అతడితో స్టెప్‌ కలుపుతారు. దీంతో వరుడు మరింత చెలరేగి బ్రేక్‌ డ్యాన్స్‌ చేస్తూ అందరిని అలరించడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వేలమంది వీక్షించారు. దీంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు వరుడి డ్యాన్స్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు షేర్లు, లైక్స్‌, కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇది అద్భుతమైన వీడియో అని చెప్పగా మరొకరు వరుడి డ్యాన్స్‌ అదిరిపోయిందని వ్యాఖ్యానించాడు. మోనిక్ ఎడ్వర్డ్స్ తన ట్విట్టర్ హ్యాండిల్‌తో ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 54 వేలకు పైగా చూశారు. ఏది ఏమైనప్పటికీ వరుడి డ్యాన్స్‌ అందరిని అలరించడం విశేషం.

రేషన్ కార్డు దారులకు గమనిక..! కామన్ సర్వీస్ సెంటర్స్‌ ద్వారా ఈ 6 సేవలు అందుబాటులోకి..

KTR Defamation Suit: ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్

siri hanumant Photos: బ్లాక్ డ్రస్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. సిరి హనుమంత్ ఫోటోలు..