రేషన్ కార్డు దారులకు గమనిక..! కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఈ 6 సేవలు అందుబాటులోకి..
Ration Card Holders: పేద కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో ఒకటి జాతీయ ఆహార భద్రతా పథకం.

Ration Card Holders: పేద కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో ఒకటి జాతీయ ఆహార భద్రతా పథకం. ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డ్ ఉన్నవారికి ఆహార ధాన్యాలు అందిస్తారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. అయితే దేశంలో చాలా కుటుంబాలకు ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు. వారు రేషన్ కార్డులు పొందడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. వీరికోసం ప్రభుత్వం 3.7 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్స్ ( CSC) కేంద్రాలను అందుబాటులలో తెచ్చింది. ఇందులో రేషన్ కార్డుకి సంబంధించిన అన్ని సేవలను కల్పిస్తోంది. వీటివల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్ల మంది రేషన్ కార్డ్ హోల్డర్లు ప్రయోజనం పొందనున్నారు.
కామన్ సర్వీస్ సెంటర్స్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
1. రేషన్ కార్డును అప్‌డేట్ చేయొచ్చు. 2. రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయవచ్చు. 3. మీ రేషన్ కార్డు డూప్లికేట్ కాపీ ని తీసుకోవచ్చు. 4. మీ రేషన్ లభ్యత గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. 5. రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను చేయవచ్చు. 6. రేషన్ కార్డు పోయినట్లయితే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ సరఫరాను సమన్వయం చేయడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటివల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్ల మంది రేషన్ కార్డ్ హోల్డర్లు లబ్ధి పొందుతారని ఒక అంచనా. ఇప్పుడు వారు తమ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి, డూప్లికేట్ కార్డును పొందడానికి, కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి, రేషన్ లభ్యత గురించి సమాచారాన్ని పొందడానికి, ఫిర్యాదులను నమోదు చేయడానికి సమీప CSC సెంటర్‌ని సందర్శించవచ్చు. CSC ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ త్యాగి మాట్లాడుతూ “ఆహార, ప్రజా పంపిణీ శాఖతో భాగస్వామ్యం వల్ల గ్రామ స్థాయిలో మా ఆపరేటర్లు రేషన్ కార్డులు లేని వ్యక్తులను గుర్తిస్తారు. వారికి ఉచిత రేషన్, వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందేలా చూస్తారు”
రేషన్ కార్డ్‌లో మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి
మీ రేషన్ కార్డ్ కి మొబైల్ నంబర్ అప్‌డేట్ లేకపోతే వెంటనే ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌కి దరఖాస్తు పెట్టుకోవాలి. అందుకోసం అప్‌డేట్ మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ ఫోటోకాపీ, పాత రేషన్ కార్డ్ ఫోటోకాపీ, సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్నిరోజులకు మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అవుతుంది.