త్వరలో హైదరాబాద్‌లో బిచ్చగాళ్లు కనిపించరు..! కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 20, 2021 | 12:50 PM

SMILE Scheme: రోడ్డుపై వెళ్లేటప్పుడు మనకు తరచూ పెద్ద సంఖ్యలో యాచకులు కనిపిస్తారు. సిగ్నల్‌ పాయింట్స్‌, దేవాలయాలు,

త్వరలో హైదరాబాద్‌లో బిచ్చగాళ్లు కనిపించరు..! కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
Beggars

Follow us on

SMILE Scheme: రోడ్డుపై వెళ్లేటప్పుడు మనకు తరచూ పెద్ద సంఖ్యలో యాచకులు కనిపిస్తారు. సిగ్నల్‌ పాయింట్స్‌, దేవాలయాలు, పార్కులు, హోటళ్లు ఇంకా జన సమూహం ఎక్కువగా ఉండేచోట వీరు యాచించడం మనం చూడవచ్చు. చాలాసార్లు మనం కూడా వారికి చిన్న మొత్తంలో సాయం చేసి ఉండవచ్చు. కానీ భిక్షాటన వారి జీవితాన్ని మార్చదు. యాచకుల సంక్షేమం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం స్మైల్ పథకాన్ని ప్రారంభించింది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కింద బిచ్చగాళ్ల సంక్షేమానికి నిధులు కేటాయించింది. వారి జీవనోపాధి, పునరావాసం, విద్య, శిక్షణ గురించి తగిన చర్యలు తీసుకుంటుంది.

ఆహారం, విద్య, శిక్షణ ఉచితం భిక్షాటన చేసే వ్యక్తులు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద పునరావాసం పొందుతారు. రాబోయే 10 సంవత్సరాలు వారి జీవన వ్యయం, ఆహారం, విద్య, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ మొత్తం మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. ప్రస్తుతం, పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఢిల్లీ సహా దేశంలోని 10 పెద్ద నగరాలలో ప్రవేశపెడుతోంది. ఎంపిక చేసిన నగరాల్లోని బిచ్చగాళ్ల సంఖ్యను ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇప్పటికే సర్వే జరిగింది. ఢిల్లీలో మహిళలు, పిల్లలతో సహా వారి సంఖ్య 20 వేలకు పైగా ఉందని తేలింది.

పైలెట్‌ ప్రాజెక్ట్ కింద ఈ 10 నగరాలు ఎంపిక.. మొదటి దశలో ఢిల్లీ సహా10 నగరాల్లో భిక్షాటనను తొలగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తర్వాత ఈ పథకం ఇతర నగరాలకు విస్తరిస్తుంది. ఎంపిక చేసిన నగరాలలో ఢిల్లీ, ముంబై, పాట్నా, ఇండోర్, చెన్నై, బెంగళూరు, నాగపూర్, హైదరాబాద్, లక్నో, అహ్మదాబాద్ ఉన్నాయి. ఇంతకు ముందు అహ్మదాబాద్‌కు బదులుగా కోల్‌కతా ఉండేది కానీ బెంగాల్ మమతా ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల కేంద్రం ఈ పైలట్ ప్రాజెక్ట్ నుంచి కోల్‌కతాను తొలగించింది.

బిచ్చగాడి పూర్తి డేటా సిద్ధం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రతి బిచ్చగాడి పూర్తి డేటా ఈ పథకం కింద తయారు చేశారు. ఇందులో యాచించే ప్రాంతం, వారి విద్యా అర్హత, ఆరోగ్యం మొదలైన వివరాలు ఉంటాయి. అయితే వారి గుర్తింపునకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఈ వివరాల ఆధారంగా వారికి పునరావాసం కల్పిస్తారు. వారి విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మొదలైన వాటి కోసం పని మొదలైంది.

వచ్చే 5 సంవత్సరాలలో 200 కోట్లు ఖర్చు మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. వచ్చే ఐదేళ్లలో ఈ మొత్తం పథకం కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తారు. అలాగే యాచకుల పునరావాసంపై 10 సంవత్సరాల సమయం కేటాయించారు. ఎందుకంటే వారి జీవన అలవాట్లు పూర్తిగా మారకపోతే వారు మళ్లీ భిక్షాటన మార్గాన్ని వదలరని మంత్రిత్వ శాఖ సూచిస్తోంది. ఎంపిక చేసిన ఈ10 నగరాల్లో పథకం విజయవంతమైన తరువాత దీనిని దేశంలోని 100 నగరాలకు విస్తరిస్తారు.

AP CM YS Jagan: పరిషత్ ఫలితాలు మరింత బాధ్యతను పెంచాయి.. విపక్షాల కుట్రలు, కుయుక్తులు చెల్లవుః వైఎస్ జగన్

Vijay Makkal Iyakkam: తమిళనాడు పంచాయతీ ఎన్నికల బరిలో హీరో విజయ్ పార్టీ.. రెండో రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

Viral News: కలెక్టర్‌‌ కావాలనుకున్న బాలిక.. వెంటాడిన ప్రాణాంతక వ్యాధి.. ఫైనల్‌గా నెలవేరిన కల

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu