TSRTC Chairman: తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తాం.. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 20, 2021 | 12:20 PM

నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తామని టీఎస్‌ఆర్‌టీసీ నూతన ఛైర్మన్ బాజిరెడ్డ గోవర్థన్ తెలిపారు. కరోనా కష్టాల నుంచి తేరుకుంటామన్నారు. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

TSRTC Chairman: తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తాం.. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్
Tsrtc Chairman Bajireddy Govardhan 1

Follow us on

TSRTC Chairman: నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తామని టీఎస్‌ఆర్‌టీసీ నూతన ఛైర్మన్ బాజిరెడ్డ గోవర్థన్ తెలిపారు. కరోనా కష్టాల నుంచి తేరుకుంటామన్నారు. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి రెండో చైర్మన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్దన్‌కి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, బాజిరెడ్డి గోవర్దన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువ కావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, గణేశ్‌ గుప్తా తదితరులు హాజరయ్యారు.

Tsrtc Chairman Bajireddy Govardhan

Tsrtc Chairman Bajireddy Govardhan

టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను సీఎం కేసీఆర్‌ ఈనెల 16న నియమించారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్నారు. గోవర్దన్‌ స్వస్థలం సిరికొండ మండలం రావుట్ల. పోలీస్‌ పటేల్‌ నుంచి ఆర్టీసీ చైర్మన్‌ స్థాయికి ఎదిగారు. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం సిరికొండ ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1999లో ఆర్మూర్‌, 2004లో బాన్సువాడ, 2014, 18లో నిజామాబాద్‌ రూరల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన బాజిరెడ్డి.. ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తో కలిసి, ఒకప్పుడు ఆసియాలోనే నెంబర్ వన్ ఉన్న సంస్థ ప్రస్తుత నష్టాలను అధిగమిస్తామన్నారు. రోజుకు రూ.13 కోట్ల ఆదాయం ఉన్న సంస్థ.. ఖర్చు రూ.18 కోట్లు అవుతుందన్నారు. త్వరలో కష్టాలను అధిగమించి లాభాల దిశగా పయనించేలా ప్రయత్నిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారి సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. అన్ని బస్టాండులను అధునీకరిస్తామని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోన వల్ల నష్టంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు డీజిల్ పెరుగుదలతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చిందన్నారు. కరోన సమయంలో ఆదాయం లేకున్నా ఇక్కడ జీతాలు ఇచ్చామన్న బాజిరెడ్డి.. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరి ఇక్కడ ఆర్టీసీ ఆస్తుల అమ్మే ప్రసక్తే లేదన్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆర్టీసీ మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి మమ్మల్ని తక్కువ వ్యవధిలోనే నియమించారు.. తార్నాక హాస్పిటల్‌ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మారుస్తామన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Read Also…  ANR Jayanthi: టాలీవుడ్‌లో ఏఎన్నార్ 75ఏళ్ల జర్నీ.. ఆయనో బహుదూరపు బాటసారి. ఆ మహానటుడు జయంతి సందర్భంగా రేర్ ఫొటోస్ మీకోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu