White Challenge: నేను పరీక్షకు సిద్ధం.. రేవంత్‌ లైడిటెక్టర్‌ టెస్ట్‌కు సిద్ధమా..?: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి టెస్టుల‌కైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

White Challenge: నేను పరీక్షకు సిద్ధం.. రేవంత్‌ లైడిటెక్టర్‌ టెస్ట్‌కు సిద్ధమా..?: మంత్రి కేటీఆర్‌
Ktr Vs Revanth
Follow us

|

Updated on: Sep 20, 2021 | 10:26 AM

KTR vs Revanth Twitter War: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి టెస్టుల‌కైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తాన‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. చ‌ర్లప‌ల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి త‌న‌ది కాదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నెలకొంది. ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్‌పై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని.. మంత్రి కేటిఆర్ కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్…‘‘నేను ఏదైనా పరీక్షకు సిద్ధంగా ఉన్నాను…రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేపించుకోవడానికి సిద్ధామా?…ఇందుకోసం ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్స్ చేయించుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వ‌స్తే రేవంత్ రెడ్డి త‌న‌కు క్షమాప‌ణ‌లు చెప్పి, ప‌ద‌వులు వ‌దులుకుంటారా? అని కేటీఆర్ సూటిగా అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుల‌కు రేవంత్ సిద్ధమా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

Read Also…. Ganesh Immersion: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి.. సముద్రంలో ముగ్గురు యువకులు గల్లంతు..