AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Biryani: ప్రాణం తీసిన చికిన్ బిర్యానీ.. అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు.. పోలీసులు ఎమన్నారంటే..?

హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ‌కుడు త‌న‌కు ఇష్టమైన‌ చికెన్ బిర్యానీని ఆర‌గించిన కాసేప‌టికే కుప్పకూలిపోయాడు.

Chicken Biryani: ప్రాణం తీసిన చికిన్ బిర్యానీ.. అనుమానం వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు.. పోలీసులు ఎమన్నారంటే..?
Biryani
Balaraju Goud
|

Updated on: Sep 20, 2021 | 10:59 AM

Share

Man dies after consuming Biryani: హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ‌కుడు త‌న‌కు ఇష్టమైన‌ చికెన్ బిర్యానీని ఆర‌గించిన కాసేప‌టికే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి మిత్రులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న న‌ర్సంపేట ప‌ట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. చెన్నరావుపేట మండ‌ల ప‌రిధిలోని బోడ తండాకు చెందిన ప్రసాద్(23) ఆదివారం న‌ర్సంపేట ప‌ట్టణానికి వ‌చ్చాడు. అక్కడున్న ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ప్రసాద్.. చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. రుచిగా ఉన్న బిర్యానీని ఇష్టంగా ఆరగించిన ప్రసాద్.. అనంత‌రం రెస్టారెంట్ నుంచి బ‌య‌ట‌కు రాగానే వాంతులు చేసుకున్నాడు. నోట్లో నుంచి బ్లడ్ కూడా రావ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకునేసరికి, అప్ప‌టికే ప్రసాద్ స్పృహ కోల్పోయాడు. స్థానిక క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్‌కు ప్రసాద్‌ను త‌ర‌లించ‌గా, మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. మున్సిప‌ల్ అధికారులు బిర్యానీ సెంట‌ర్‌కు వెళ్లి, ఫుడ్ శాంపిల్స్‌ను సేక‌రించారు. పోస్టుమార్టం నివేదిక వ‌చ్చిన త‌ర్వాతే ప్రసాద్ మృతికి గ‌ల కార‌ణాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు.

Read Also… Hybrid Kidney Video: హైబ్రిడ్‌ మూత్రపిండంతో డయాలసిస్‌కు గుడ్‌బై..? కృత్రిమంగా కిడ్నీ తయారీ(వీడియో)