Tirumala: తిరుపతి అలిపిరిలో దళారుల మధ్య కొట్లాట.. భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్ము వాటాల పంపకంలో తేడాలు.!

దేవాదిదేవుడు తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య దాడులకు

Tirumala: తిరుపతి అలిపిరిలో దళారుల మధ్య కొట్లాట..  భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్ము వాటాల పంపకంలో తేడాలు.!
Tirumala
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 20, 2021 | 10:10 AM

Tirupati – Alipiri: దేవాదిదేవుడు తిరుమలేశుని భక్తుల నుంచి వసూలు చేసిన సొమ్మును వాటాలుగా పంచుకోవడంలో వచ్చిన తేడాలు దళారుల మధ్య దాడులకు దారితీసింది. డబ్బులు పంచుకునే క్రమంలో బ్రోకర్లు దాడులకు దిగారు. కొట్లాడుకున్నారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు చేర్చే విషయంలో దళారుల మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఈ గొడవల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై ఏవిఎస్ఓ శైలేంద్ర బాబు అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేశారు అలిపిరి పోలీసులు.

ఇలా ఉండగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను ఈ అర్థరాత్రి నుంచి పెంచింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయబోతోంది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటూ దర్శన సమయంను పెంచింది టీటీడీ.

రాత్రి 12 గంటలకు స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించనున్న నేపథ్యంలో రాత్రి 12 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. కరోనా కారణంగా గతేడాది లాక్ డౌన్ నుండి రాత్రి 9 గంటలకే ఏకాంత సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తూ వస్తున్నారు టీటీడీ అధికారులు. అంతేకాదు.. ఇప్పటి వరకు చిత్తూరు వాసులకు మాత్రమే పరిమితం చేసిన సర్వదర్శనం టికెట్లను.. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు భక్తులకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టొకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది.

Read also: టాలీవుడ్ సినీ పెద్దలతో కాసేపట్లో ఏపీ ప్రభుత్వం భేటీ, ఇంతకీ.. ఇండస్ట్రీ ఏం కోరుకుంటోంది.. ప్రభుత్వం ఏమంటోంది?