Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తిరుమలలో వరాహాలు.. మూలికలు, ఆకులు ఎలా తింటున్నాయో చూడండి

తిరుమల కొండ ఆది వరహా క్షేత్రం. ఇక్కడ వరహా స్వామిని శ్రీవారికంటే ముందే దర్శించుకోవడం క్షేత్ర సంప్రదాయం. తిరుమల కొండపై అడవి పందులు స్వేచ్ఛగా విహరిస్తాయి.

Viral Video: తిరుమలలో వరాహాలు.. మూలికలు, ఆకులు ఎలా తింటున్నాయో చూడండి
Pigs In Tirumala
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 20, 2021 | 7:22 PM

తిరుమల కొండ ఆది వరహా క్షేత్రం. ఇక్కడ వరహా స్వామిని శ్రీవారికంటే ముందే దర్శించుకోవడం క్షేత్ర సంప్రదాయం. తిరుమల కొండపై అడవి పందులు స్వేచ్ఛగా విహరిస్తాయి. అప్పుడప్పుడూ శ్రీవారి ఆలయం వద్దకు కూడా వస్తాయి. అడవి పందులు స్వేచ్ఛగా తిరగడాన్ని తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేము. తిరుమల కొండపై మూలికలు, ఆకులు, అలమలు తింటూ వరహాలు జీవిస్తాయి. తాజాగా తిరుమల స్థానికులు నివాసముండే బాలాజీ నగర్ సమీపంలో అడవి పందులు ఆహారాన్ని తింటూ కెమెరాకు చిక్కాయి. ఆ దృశ్యాలను దిగువన వీడియోలో వీక్షించండి.

శాస్త్రోక్తంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప‌విత్రోత్స‌వాలు

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా జరిగాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించారు. ఉద‌యం 8.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 12 నుండి 1 గంట వ‌ర‌కు స్వామి, అమ్మ‌వారి మూలమూర్తుల‌కు, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామి, అమ్మ‌వార్ల ఊరేగింపు నిర్వ‌హించ‌నున్నారు.

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.05 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తార‌ని చెప్పారు. ప్రతి ఏడాది మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తొంద‌న్నారు. సెప్టెంబ‌రు 18న ప్రారంభ‌మైన పవిత్రోత్స‌వాలు సోమ‌వారం మహాపూర్ణాహుతితో ముగిశాయ‌ని తెలిపారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగుతున్నందున‌, ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనాల‌ని భావించే భ‌క్తుల కొర‌కు ఎస్వీబీసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ సేవ‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసిన‌ట్లు వివ‌రించారు.

Also Read:  సత్తా చాటిన సేనాని సైనికులు… అభ్యర్థి లేకపోయినా.. పార్టీని గెలిపించారు

 పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు… ఆ రోజు నుంచే పనులు