Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: సత్తా చాటిన సేనాని సైనికులు… అభ్యర్థి లేకపోయినా.. పార్టీని గెలిపించారు

అక్కడ జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి ఎలక్షన్ నుంచి తప్పుకున్నాడు.  వైసీపీకి మద్దతు ప్రకటించాడు. అంతేనా...

Janasena: సత్తా చాటిన సేనాని సైనికులు... అభ్యర్థి లేకపోయినా.. పార్టీని గెలిపించారు
Janasena
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 20, 2021 | 6:46 PM

అక్కడ జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థి ఎలక్షన్ నుంచి తప్పుకున్నాడు.  వైసీపీకి మద్దతు ప్రకటించాడు. అంతేనా అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ జోరుగా ప్రచారం చేశాడు. తాము ఎన్నో ఆశలు పెట్టుకుని బలపరిచిన వ్యక్తి ఉన్నఫలంగా బరిలో నుంచి తప్పుకోవడంతో జనసేన కార్యకర్తలు హర్టయ్యారు. అతడు వైసీపీ మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రాంతంలో జనసేన జెండా ఎగరేయాల్సిందే అని బ్లైండ్‌గా ఫిక్సయ్యారు.  అభ్యర్థి పోయినా.. పార్టీని గెలిపించుకుంటామంటూ శపథం చేశారు. వారిని అందరూ లైట్ తీసుకున్నారు. ‘వారిదేం ప్రచారంలే.. అంతా జగన్ వేవ్ నడుస్తోంది.  అధికార పార్టీ గెలుపు నల్లేరుపై నడకే’.. అనుకున్నారంతా. కానీ ఆదివారం బ్యాలెట్‌ బాక్సులు తెరచి ఓట్లు లెక్కించాక అంతా కంగుతున్నారు. అభ్యర్థి సైడ్ అయిపోయినా.. జనసేన పార్టీనే విక్టరీ నమోదు చేసింది. పార్టీని వదిలి వెళ్లిపోయినా.. బొచ్చెల తాతారావే విజేతగా నిలిచాడు.  పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు ఎంపీటీసీ పదవి.. ఈసారి తాతారావు పేరుపై రాసి ఉన్నట్లుంది. అందుకే వద్దునుకున్నా.. అతడినే విజయం వరించిది. వైసీపీ అభ్యర్థి ములగాల వెంకటేశ్వరరావుకు 859 ఓట్లు రాగా.. బొచ్చెల తాతారావుకు 937 ఓట్లు వచ్చాయి. 78 ఓట్ల ఆధిక్యంతో జనసేన విజయ బావుటా ఎగరవేసింది. సేనాని సైనికులు మొత్తం మీద తమ సత్తా చాటారు.

Botchala Tatarao

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఏకపక్ష విజయం

కాగా పరిష‌త్ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అధికార వైసీపీ దుమ్మురేపింది. అన్ని జిల్లాల్లో వైసీపీ తిరుగులేని హవా కొనసాగించింది. ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.  13 జిల్లా పరిషత్‌లనూ వైసీపీ చేజిక్కించుకుంది. ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అభ్యర్ధుల భవితవ్యం కూడా తేలిపోయింది. ఇక, ఇప్పుడు జెడ్పీ చైర్మన్ల సందడి మొదలైంది. గెలిచిన ఆశావహులు అప్పుడే చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. గెలిచిన ఎంపీటీసీలు కూడా ఎంపీపీ పదవి కోసం నాయకుల దగ్గరకు క్యూ కడుతున్నారు.

Also Read:  నిర్మల్ జిల్లాలో లేడీ డాన్స్ హల్‌చల్.. డబ్బులిస్తే ఓకే.. లేదంటే రచ్చ.. రచ్చే

కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు జననం