Chandra Babu: ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆరోగ్యంపై ఆరా..
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. విద్యానగర్‌లోని మందకృష్ణ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి చంద్రబాబు ఆరా తీశారు.

ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. విద్యానగర్‌లోని మందకృష్ణ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి చంద్రబాబు ఆరా తీశారు. గంట సమయం పాటు ఆయనతో చర్చించారు. శస్త్ర చికిత్స గురించి ఆడిగి తెలుసుకున్నారు. అలాగే మందకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు వెంటనే పలువురు స్థానిక నాయకులు ఉన్నారు.
ఇటీవల ఢిల్లీలో మంద కృష్ణ మాదిగ ఇటీవల బాత్‌రూంలో కాలు జారి పడడంతో బోన్ ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మందకృష్ణను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పలువురు పరామర్శించారు. ఇప్పటికే పలువురు రాజకీయ పార్టీ నేతలు, ఎమ్మార్పీఎస్ నేతలు మందకృష్ణను పరామర్శించారు.
ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..
PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..
