Crime News: నిర్మల్ జిల్లాలో లేడీ డాన్లు హల్‌చల్.. డబ్బులిస్తే ఓకే.. లేదంటే రచ్చ.. రచ్చే

నిర్మల్ జిల్లాలో లేడీ డాన్స్ మరోసారి రెచ్చిపోయారు. బైక్స్‌పై వెళ్తోన్న యువతే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ఒకేసారి గుంపుగా రావడం...

Crime News: నిర్మల్ జిల్లాలో లేడీ డాన్లు హల్‌చల్.. డబ్బులిస్తే ఓకే.. లేదంటే రచ్చ.. రచ్చే
Niraml District
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 20, 2021 | 6:04 PM

నిర్మల్ జిల్లాలో లేడీ డాన్స్ మరోసారి రెచ్చిపోయారు. బైక్స్‌పై వెళ్తోన్న యువతే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. ఒకేసారి గుంపుగా రావడం… డబ్బు డిమాండ్ చేయడం ఇదీ లేడీ డాన్ల పని. అడిగినంత డబ్బు ఇవ్వలేదో వాళ్ల పనైపోయినట్టే. ఒక్కసారిగా విరుచుకుపడుతూ పట్టపగలే నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని బాసర, దర్మాబాద్ ప్రాంతాల్లో ఈ వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే మూకుమ్మడిగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ లేడీ డాన్స్ ఆగడాలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. బైక్‌లపై వెళ్తోన్న యువకులనే వీరు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి వీళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో టీమ్‌లో ఎనిమిది మందికి పైగా సభ్యులున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన అమ్మాయిలు బృందాలుగా ఏర్పడి స్వచ్చంద సంస్థ వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. స్వచ్చంద సంస్థ పేరు చెప్పాలని వాహనదారులు అడిగితే ఆన్సర్ ఇవ్వడం లేదు. పైగా, డబ్బు ఇవ్వని వారిని దుర్భాషలాడుతున్నారు.

ఇటీవల గుంటూరులోనూ, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపైన ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా జాతీయ రహదారులపై, పోలీస్ స్టేషన్లకు దూరంగా ఉండే ప్రాంతాలపై ఈ లేడీ డాన్స్ ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటి వారితో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. వారికి డబ్బు ఇవ్వొద్దని సూచించారు. ఎవరికైనా ఇలాంటి వారు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు చెప్పారు.

Also Read:కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు జననం

 ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని నేనంటే నేనంటూ కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఒకరు మృతి