AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miracle: కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు జననం

కాకతాళీయమా..! దేవుడిచ్చిన వరమా..? అంటే.. అవును దేవుడిచ్చిన వరమే అంటున్నారు దంపతులు. ఐనవారందర్నీ కోల్పోయినా ఆ దంపతుల ముఖాల్లో మళ్లీ  ఇప్పుడు చిరునవ్వులు విరబూస్తున్నాయి.

Miracle: కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు జననం
Miracle
Ram Naramaneni
|

Updated on: Sep 20, 2021 | 4:02 PM

Share

కాకతాళీయమా..! దేవుడిచ్చిన వరమా..? అంటే.. అవును దేవుడిచ్చిన వరమే అంటున్నారు దంపతులు. ఐనవారందర్నీ కోల్పోయినా ఆ దంపతుల ముఖాల్లో మళ్లీ  ఇప్పుడు చిరునవ్వులు విరబూస్తున్నాయి. రెండేళ్ల క్రితం బోటు ప్రమాదంలో ఏ రోజేతై ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో..! సరిగ్గా అదే తేదీన ఊహించని రీతిలో మళ్లీ ఇద్దరు ట్విన్స్‌ జన్మించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. విధి ఆడించిన వింత నాటకమంటే ఇదేనేమో..అంటున్నారు ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసినవారు.

2019-సెప్టెంబరు 15. ఏపీలోని భద్రాచలం దగ్గర విషాదం జరిగింది. వశిష్ట బోటు కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో మునిగిపోయింది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బోటులో విశాఖ ఆరిలోవకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నారు. తలారి అప్పలరాజు తన తల్లితోపాటు ఇద్దరు కూతుళ్లు గీతావైష్ణవి, ధాత్రి అనన్యలను కూడా భద్రాచలం రాముడి దర్శనానికి పంపించారు. ఆ ప్రమాదంలో ఇద్దరు కుమార్తులు( ఒకరికి మూడేళ్లు, మరొకరికి ఏడాదిన్నర), తల్లితో కలిపి మొత్తం 9 మంది కుటుంబసభ్యులు మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. బోరున విలపించారు. భార్య భాగ్యలక్ష్మికి అప్పటికే ట్యూబెక్టమీ ఆపరేషన్‌ జరగడంతో పిల్లలు పుట్టరని కుంగిపోయారు. కృత్రిమ గర్భాధారణ ద్వారా పిల్లలు పుడతారని తెలుసుకొని విశాఖలో పద్మశ్రీ ఆస్పత్రిని గతేడాది సంప్రదించారు. సరిగ్గా ప్రమాదం జరిన తేదీ సెప్టెంబరు 15నే ఆమె ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు బిడ్డలను కోల్పోయి శోకంలో ఉన్న తమకు ఇది ఆ దేవుడిచ్చిన వరమంటూ మురిసిపోతున్న అప్పలరాజు దంపతులు.

కచ్చులూరు ఘటనలో అందర్నీ కోల్పోయాక తమకు దేవుడిపై నమ్మకం పోయిందన్నారు చిన్నారు తల్లి భాగ్యలక్ష్మి. ఈ రెండేళ్లు నరకం అనుభవించామన్నారు. ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన రోజునే.. తిరిగి ఇద్దరు కవలలకు జన్మనివ్వడం దేవుడి మహిమగానే భావిస్తున్నామన్నారు. ఆ ఇద్దరే మళ్లీ పుట్టారని..అందుకే వాళ్లకు గీతావైష్ణవి, ధాత్రి అనన్య పేర్లే పెడతామంటున్నారు ఆమె. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ భద్రాచలం రాములోరి దర్శనానికి వెళ్తామంటున్నారు అప్పలరాజు దంపతులు. భాగ్యలక్ష్మికి డెలివరీ డేట్‌ 20 తేదీ అని వైద్యులు చెబితే…ఆమెకు 15వ తేదీనే పురిటి నొప్పులు వచ్చాయన్నారు.

Also Read: ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని నేనంటే నేనంటూ కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఒకరు మృతి

పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డ ఏడవలేదు.. ఆ తల్లి ఆవేదన అంతా, ఇంతా కాదు..