- Telugu News Photo Gallery Cricket photos IPL Players who played 100 matches with the same team jasprit bumrah Virat Kohli kieron pollard sunil narine lasith malinga
IPL 2021: ఐపీఎల్‌లో జట్టు మారకుండా 100 మ్యాచ్‌లు పూర్తి చేసిన ఆటగాళ్లు వీరే..!
IPL 2021: ఐపిఎల్‌లో ఆడటం ప్రతి ఆటగాడి కల. ఫ్రాంచైజీలు కూడా మంచి ఆటగాళ్ల కోసం వెతుకుతుంటాయి. కానీ కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అదే జట్టులో ఉన్నారు. అంతేకాదు 100 మ్యాచ్‌లు కంప్లీట్ చేశారు. ఆ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
Updated on: Sep 20, 2021 | 4:15 PM

ఐపిఎల్ 2021 రెండో దశ మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మద్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై బుమ్రాకు స్థానం కల్పించింది. ఇది అతనికి ఐపిఎల్‌లో 100 వ మ్యాచ్. బుమ్రా తన ఐపిఎల్‌లో మొత్తం100 మ్యాచ్‌లు ముంబై తరపున ఆడాడు. అతను 2013 లో అరంగేట్రం చేశాడు.

విరాట్ కోహ్లీ కూడా 2008 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తన ఐపిఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి అదే జట్టుతో ఆడుతున్నాడు. అతను ప్రస్తుతం జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు ఆర్‌సిబి కోసం 199 మ్యాచ్‌లు ఆడాడు.

ప్రస్తుతం ముంబైకి కీరన్ పొలార్డ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పొలార్డ్ ముంబై కోసం 172 మ్యాచ్‌లు ఆడాడు. పొలార్డ్ 2010 నుంచి IPL లో ఆడుతున్నాడు.

సునీల్ నరైన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. KKR కోసం నరేన్ ఇప్పటివరకు 124 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2012 నుంచి KKR కోసం ఆడుతున్నాడు.

లసిత్ మలింగ ముంబై కోసం 122 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2009 నుంచి 2019 వరకు ముంబై కోసం ఆడాడు.





























