AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Lady: తక్కువ ధరకే బంగారం.. జమీందారి కుటుంబం.. నమ్మితే నిండా ముంచేస్తుంది.. విజయవాడలో గోల్డ్ లేడీ మాయలు..

కలరింగ్‌లో ఆమెకు ఆమె సాటి. మోసాల్లో కెల్లా ఆమె చేసే మోసాలే వేరు. పెద్ద పెద్ద ఉద్యోగులే ఆమె టార్గెట్. విదేశాల నుంచి తెచ్చి బంగారం తక్కువ ధరకు తెచ్చి విక్రయిస్తామని బిల్డప్ ఇస్తోంది.

Gold Lady: తక్కువ ధరకే బంగారం.. జమీందారి కుటుంబం.. నమ్మితే నిండా ముంచేస్తుంది.. విజయవాడలో గోల్డ్ లేడీ మాయలు..
Gold Selling Lady
Sanjay Kasula
|

Updated on: Sep 20, 2021 | 7:04 PM

Share

కలరింగ్‌లో ఆమెకు ఆమె సాటి. మోసాల్లో కెల్లా ఆమె చేసే మోసాలే వేరు. పెద్ద పెద్ద ఉద్యోగులే ఆమె టార్గెట్. విదేశాల నుంచి తెచ్చి బంగారం తక్కువ ధరకు తెచ్చి విక్రయిస్తామని బిల్డప్ ఇస్తోంది. తమది జమీందారి కుటుంబమంటూ హడావుడి చేస్తోంది. అందిన కాడికి దోచుకుంటుంది. ఎంత తెలివిమంతులైనా ఎక్కడో చోట బోర్ల పడక తప్పదు కదా. మాయలేడి మోసాలిప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వివరాల్లోకి వెలితే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సింహాద్రి నాగమణి 13 ఏళ్ల క్రితం ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో టిసి వెంకటేశ్వరరావుతో పరిచయం పెంచుకుంది. భర్త ఉన్న చనిపోయాడని చెప్పి అప్పటి నుంచి వెంకటేశ్వరరావుతో సహజీవనం చేస్తుంది. జల్సాలకు అలవాటు పడిన నాగమణి ఈజీ మని కోసం ప్లాన్ చేసింది.

దోచుకోవడంలో నాగమణి స్టైలే వేరు. తమది జమీందారి కుటుంభమని కలరింగ్ ఇస్తోంది. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మిస్తోంది. ముందుగా డబ్బు తీసుకుని ఉడాయిస్తుంది. ఇలా దొరికిన వారికి టోపీ పెట్టింది. వెంకటేశ్వరరావు ద్వారా రైల్వే ఉద్యోగులతో పరిచయం పెంచుకున్న నాగమణి.. కువైట్ నుంచి బంగారం తెచ్చి తక్కువ ధరకు అమ్ముతామని ఉద్యోగులను నమ్మించింది.

గోల్డ్ కావాలంటే ముందుగానే నగదు ఇవ్వాలని షరతు విధించింది. దుర్గగుడి ఉద్యోగులతో కూడా పరిచయం పెంచుకున్న నాగమణి వారికి గిఫ్ట్‌లు ఇచ్చి మరి తమది జమిందారి కుటుంబంలా కలరింగ్ ఇచ్చి వలలో వేసుకుంది. ఇలా రైల్వే, దుర్గ గుడి ఉద్యోగుల దగ్గర 10 కోట్ల రూపాయల మేర దోచుకుంది. మోసపోయిన బాధితులు ప్రశ్ని స్తే కిడ్నాప్ డ్రామా ఆడి వారి పైనే కేసుపెట్టింది.

పోలీసులు మాయలేడి నాగమణిని అదుపులోకి తీసుకుని విచారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కరి వద్ద 10 నుంచి 70 లక్షల రూపాయల చొప్పున పది కోట్ల రూపాయలు దోచుకుంది. సంవత్సరాలు గడుస్తున్నా బంగారం, నగదు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు నాగమణిని ప్రశ్నించారు.

దీంతో తిరిగి వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది నాగమణి. ఈ వ్యవహారంపై పోలీసులు 20 రోజుల పాటు చేసిన విచారణలో బాధితుల నుంచి తీసుకున్న డబ్బును జల్సాలకు వినియోగించినట్లు తేలింది. 2 కోట్ల రూపాయలు ఆన్‌లైన్ రమ్మీ ఆడేందుకు, మద్యానికి ఖర్చు చేసినట్లు పోలీసులకు చెప్పింది. బాధితుల ఫిర్యాదుతో సూర్యారావుపేట పోలీసులు మాయలేడి నాగమణిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..