AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అయ్యో పాపం.. ఆ చిన్నారికి ఎంత కష్టం. రాక్షసుడిగా మారిన కన్న తండ్రి..

Viral News: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీస మానవత్వాన్ని మరిచి చేస్తున్న పనులు అసలు వీరు మనుషులేనా..

Viral News: అయ్యో పాపం.. ఆ చిన్నారికి ఎంత కష్టం. రాక్షసుడిగా మారిన కన్న తండ్రి..
Narender Vaitla
|

Updated on: Sep 20, 2021 | 10:33 PM

Share

Viral News: సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీస మానవత్వాన్ని మరిచి చేస్తున్న పనులు అసలు వీరు మనుషులేనా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. ముక్కు పచ్చలారని ఓ చిన్నారిని తండ్రి అత్యంత దారుణంగా హింసించిన ఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది. ఈ వార్త తెలిసిన వారంతా వాడసలు మనిషేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్‌ మున్సిపల్‌లో నాగరాజు అనే వ్యక్తి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి ఓ మూడేళ్ల చిన్నారి ఉంది. అయితే నాగరాజు గత కొన్ని రోజుల క్రితం మొదటి భార్యను వదిలేసి రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కూతురును మాత్రం తనతోనే ఉంచుకున్నాడు. కూతురును పెంచుతున్నాడు కదా.! మంచోడు అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఆ చిన్నారిపై క్రూరమృగంగా దాడికి దిగాడు. తాజాగా ఆ చిన్నారిపై తాడుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు.

అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు చిన్నారిని ఒక చేత్తో గాల్లోకి లేపుతూ నేలపై కొట్టాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఆ రెండో భార్య చిరు నవ్వులు చిందుస్తుండడం గమనార్హం. దీనంతటిని అక్కడే ఉన్న కొందరు సీక్రెట్‌గా ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు నాగరాజుపై తిట్ల దండకం మొదలు పెట్టారు. కన్న కూతురుని పాశవికంగా కోడుతున్న రాజుపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. మరి పోలీప్‌ అధికారులు రాజు కృరమైన చర్యపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: Tirumala: సర్వదర్శనం టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు.. మంగళవారం ఉదయం 6 గంటలకు నుంచి టికెట్లు..

LIC Jeevan Labh: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.230 పొదుపుతో రూ.17 లక్షలు.. పూర్తి వివరాలు..!

Bank News: రూ.170 కోట్లు.. కస్టమర్ల నుంచి ముక్కు పిండి ఆ ఛార్జీలు వసూలు చేసిన పీఎన్‌బీ

Follow Us
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్
వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్
రోజుకో గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు కరిగిపోయి కిలోలు తగ్గుతారు
రోజుకో గ్లాస్ తాగితే చాలు.. కొవ్వు కరిగిపోయి కిలోలు తగ్గుతారు
విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో వింత ప్రచారం
విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో వింత ప్రచారం
ఇలాంటివాళ్లూ ఉంటారా? రూ. 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ
ఇలాంటివాళ్లూ ఉంటారా? రూ. 47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెక్కీ
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
హైదరాబాద్ టూ ఊటీ.. అతి తక్కువ ధరలో కూల్ ట్రిప్..
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సప్తనదుల సంగమేశ్వరుడు.. జల గర్భం నుంచి బయటపడిన మహా శివాలయం!
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
సీరియల్ నటి స్వప్న జీవితంలో ఇన్ని కష్టాలా.. ? కులం పేరుతో అవమానాల
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
బొట్టు పెట్టుకుంటున్నారా?ఏ వేలితో పెట్టుకుంటే మంచిదో తెలుసా?
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఇదే..ఆ విషయంలో వీరే గ్రేట్
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి
ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా.. కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి