Tirumala: సర్వదర్శనం టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు.. మంగళవారం ఉదయం 6 గంటలకు నుంచి టికెట్లు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 20, 2021 | 10:16 PM

సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే శ్రీనివాసం వద్ద ఫుట్‌పాత్‌పై శ్రీవారి భక్తులు బారులుతీరారు. సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ...

Tirumala:  సర్వదర్శనం టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు.. మంగళవారం ఉదయం 6 గంటలకు నుంచి టికెట్లు..
Tirumala

Follow us on

సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే శ్రీనివాసం వద్ద ఫుట్‌పాత్‌పై శ్రీవారి భక్తులు బారులుతీరారు. సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రేపు ఉదయం 6 గంటలకు ఇచ్చే టికెట్ల కోసం ఇవాళ సాయంత్రం నుంచే నిరీక్షిస్తున్నారు.

ఏడుకొండలపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యాన్ని అందరికి కలిగించే బృహత్తరమైన నిర్ణయాన్ని తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. కరోనా కారణంగా కొండపై భక్తుల్ని అనుమతించే విషయంలో 5నెలల క్రితం ఉచిత దర్శనం టోకన్లను రద్దు చేసిన టీటీడీ ఇవాళ ఉదయం 6గంటల నుంచి అలిపిరి దగ్గర సర్వదర్శనం టోకెన్లను జారీ చేసింది. దీంతో ఉదయం 8గంటల నుంచే సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.

అయితే టీటీడీ ముందుగా చిత్తూరు జిల్లా వాసులకే ఉచిత దర్శన టోకెన్లు అందజేస్తోంది. అది కూడా రోజుకు పరిమిత సంఖ్యలో అంటే 2వేల టిక్కెట్లను మాత్రమే జారీ చేస్తున్నట్లుగా ప్రకటించింది. భక్తులకు వైరస్ సోకకుండా …కోవిడ్ నిబంధనలు పాటిస్తూ …శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనభాగ్యాన్ని కల్పిస్తోంది. టీటీడీ తీసుకున్న నిర్ణయం ఎంతో బాగుందంటున్నారు భక్తులు.

కరోనా తొలి దశ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను కొండపైకి అనుమతించిన టీటీడీ…ఆ తర్వాత సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో సర్వదర్శనాల్ని పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక దర్శనం రూ.300 రూపాయల టిక్కెట్‌పై కొందరికే తిరుమల ప్రవేశం కల్పిస్తూ వస్తోంది. అయితే కరోనా తీవ్రత తగ్గడం…సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో ఇప్పుడు ఇలా సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తూ శ్రీవారి ఆశీస్సులు అందరికి కలిగేలా చేసింది టీటీడీ.

ఇవి కూడా చదవండి: Hyderabad: దూసుకుపోతున్న హైదరాబాద్.. ఢిల్లీ, ముంబై ఆ తర్వాత మనమే.. ఎందులోనో తెలుసా..

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu